Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గుంటూరులో చంద్రబాబు పతాకావిష్కరణ-పాతికేళ్ల విజన్- మోడీని వారితో పోలుస్తూ వ్యాఖ్యలు

రాష్ట్రంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు, వాటి అధినేతలు జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇదే క్రమంలో ఏపీలో విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరులో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య కంపెనీ ప్రాంగణంలో టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జాతీయ జెండా ఆవిష్కరించారు. స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఉండవల్లిలోని నివాసం నుంచి గుంటూరు వరకు భారీ ర్యాలీగా వెళ్లారు.

పతాకావిష్కరణ తర్వాత చంద్రబాబు కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించారు. నాడు జాతి కష్టాల్లో ఉందని భావించి ఎన్టీఆర్ సినిమాల్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చారని చంద్రబాబు గుర్తుచేశారు. ఇప్పటికీ నేషన్ ఫస్ట్ అని ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ జెండా ప్రతి ఇంటిపై ఎగరాలని,ప్రతి ఒక్కరి మదిలో జెండా ఉండాలని చంద్రబాబు కోరారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీ, భగత్ సింగ్, అల్లూరి, సర్థార్ పటేల్, నేతాజీ వంటి జాతీయ నేతలను స్మరించుకుందామన్నారు. జాతీయ జెండా రూపకర్త పింగలి వెంకయ్యను ప్రత్యేకంగా స్మరించుకోవాలన్నారు. 400 ఏళ్ల క్రితం నాగరికతలో భారత దేశం ఎంతో ముందు ఉందన్నారు. అప్పట్లోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత దేశం ఉందన్నారు. వలస పాలనలో భారత దేశం తరువాత తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఆకలి బాధలు, కరువు కాటకాలతో దేశం అల్లాడిందని, నెహ్రూ, పీవీ, వాజ్ పేయి, మోదీ వంటి వారు దేశాన్ని నడిపించారని చంద్రబాబు తెలిపారు. దేశం స్వాతంత్ర్యం రాక ముందు, వచ్చిన తరవాత అనేది చూడాలి...అలాగే సంస్కరణలకు ముందు సంస్కరణ తరువాత అని చూడాలన్నారు.

chandrababu unfurled national flag on independene day, praise pm modi, reminds uncle ntr

నాడు పీవీ నరసింహారావు తీసుకున్న సంస్కరణలతో ప్రపంచ దేశాలతో ఇండియా పోటీ పడుతుందని చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ పేదల కోసం, బడుగుల కోసం తెలుగు దేశం పార్టీ స్థాపించారని, దేశం అంటే ఒక వ్యక్తి కాదు...అందరూ కలిస్తేనే దేశమన్నారు. ప్రతి ఒక్కరు నేషన్ ఫస్ట్ అని ఆలోచించాలని, దాని కోసం పాటుపడాలన్నారు. నాడు సమర యోధుల త్యాగాల స్ఫూర్తితో నేడు పని చెయ్యాలని చంద్రబాబు సూచించారు.
హరిత విప్లవం, పాల విప్లవంతో దేశ గమనం మారిపోయిందని, కరవు కాటకాల నుంచి ప్రపంచానికి ఆహారం పెట్టే దేశంగా భారత్ మారిందన్నారు. కరోనాకు ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ ఇచ్చే దేశంగా అవతరించిందన్నారు. కరోనా అన్ని రంగాలను కుదిపేసిందని, కానీ అప్పుడు కూడా పని చేసింది రైతులు మాత్రమేన్నారు.

దేశంలో వచ్చిన అనేక సంస్కరణలతో టీడీపీ భాగస్వామిగా ఉందని చంద్రబాబు తెలిపారు. విజన్ 2020తో నాడే టిడిపి లక్ష్యాలను నిర్థేశించుకుని పని చేసిందన్నారు. తెలుగు దేశం ప్రాంతీయ పార్టీ అయినా, జాతీయ పార్టీ గా పనిచేసిందన్నారు. నాడు స్వాతంత్ర్యం కోసం సమర యోధులు పోరాడితే...నేడు తెలుగు దేశం ప్రజల కోసం పనిచేసిందన్నారు. టెలీ కమ్యూనికేషన్ సంస్కరణలు, స్వర్ణ చతుర్భుజి, ఓపెన్ స్కై పాలసీ, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ లలో కీలకంగా వ్యవహరించామన్నారు. నేడు మనం తీసుకునే నిర్ణయాలు భావి తరాలపైనా, ప్రజల అభివృద్ది పైనా ప్రభావం చూపుతాయని చంద్రబాబు తెలిపారు.

Recommended Video

    Title : Chandrababu Naidu About పింగళి వెంకయ్య, పివి నరసింహారావు *AndhraPradesh

    మేకిన్ ఇండియాలో రక్షణ రంగ వస్తువుల తయారీలో 35 నుంచి 70 శాతానికి వెళ్లామని చంద్రబాబు తెలిపారు. ఇలాంటివి చూసినప్పుడు మనకు గర్వకారణంగా ఉంటుందన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సం సందర్భంగా ప్రతి వ్యక్తిలో స్ఫూర్తి రగలించాలన్నారు. రానున్న 25 ఏళ్లకు ఏమి చెయ్యాలి అనేది నేడు ఆలోచించాలన్నారు. ఇప్పటికీ పేదరికం ఉందని, రైతులు ఆత్మహత్యలు ఉన్నాయని, నిరుద్యో సమస్యలు ఉన్నాయని, వీటిపై ఆలోచన చెయ్యాలన్నారు. ప్రపంచంలో మన వాళ్లు గుర్తింపు సాధించినా సమస్యలు కూడా పీడిస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ విధానాల వల్ల ఫలితాలు మారుతూ ఉంటాయన్నారు. స్వర్ణ చతుర్భుజి రోడ్ల నిర్మాణంతో అనేక మార్పులు వచ్చాయని చంద్రబాబు తెలిపారు. ప్రతి ఒక్కరు నాకు ఈ దేశం ఏమి ఇచ్చింది అని కాదని, నేను ఏమి ఇచ్చాను అనేది ఆలోచించాలన్నారు. అదే సమరయోధులకు ఇచ్చిన నిజమైన నివాళి అవుతుందన్నారు. రానున్న 25 ఏళ్లకు ప్రభుత్వాలు విజన్ తయారు చేసుకోవాలని,సమస్యలు, సవాళ్లపై ప్రణాళిక సిద్దం చేసుకోవాలన్నారు. విలువలతో కూడిన సమాజాన్ని స్థాపించాలన్నారు. ఆర్ధిక అసమానతలు లేని సమాజాన్ని నిర్మించాలన్నారు..

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+