ఏపీ సీఎం జగన్‌కు వ్యాక్సిన్: ఎప్పుడు, ఎక్కడ అంటే...?
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగానే ఉంది. వైరస్ కేసులు పెరుగుతున్నాయి. రోగ నిరోధక శక్తి లేని వారు చనిపోతున్నారు కూడా. దీంతో ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. లాక్ డౌన్ లేకున్నా.. విధిగా మాస్క్ ధరించాలని కోరుతున్నాయి. భౌతికదూరం పాటించాలని స్పష్టం చేస్తున్నాయి. 45 ఏళ్ల వయస్సు వారికి వ్యాక్సిన్ కూడా అందజేస్తున్నారు. దీంతో ప్రముఖులు కూడా వ్యాక్సిన్ తీసుకుంటూ.. మిగతావారికి మరింత అవగాహన కల్పిస్తున్నారు.
ఇటు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకోనున్నారు. ఏప్రిల్ 1న గుంటూరులో జిల్లాలో ఆయన వ్యాక్సిన్ తీసుకుంటారు. భారత్ పేట వార్డు సచివాలయంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని జగన్ ప్రారంభిస్తారు. తర్వాత వ్యాక్సిన్ వేయించుకుంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఎంపీ మోపిదేవి వెంకట రమణ, మేయర్ మనోహర్, ఎమ్మెల్యే మద్దాలగిరి, జిల్లా అధికారులు సమీక్షించారు.

కరోనా వైరస్ నియంత్రణ కోసం అన్ని చర్యలు చేపట్టామని ఎంపీ మోపిదేవి వెంకట రమణ తెలిపారు. వ్యాక్సినేషన్‌కు సంబంధించి ఆర్థిక భారం పడుతున్నా.. ముందున్నామని వివరించారు. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితి తీవ్రంగా ఉందని చెప్పారు. ఏప్రిల్ 1నుంచి సచివాలయాల్లో అందుబాటులో తెస్తున్నామని పేర్కొన్నారు. ఏప్రిల్ 1న సీఎం జగన్ వ్యాక్సిన్ తీసుకుంటారని.. దీంతో ప్రజల్లో ఉన్న కాసిన్ని అపోహలు తొలగిపోతాయని చెప్పారు. ప్రభుత్వ సలహాలు, సూచనలు ప్రజలంతా పాటించాలి మోపిదేవి అన్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications