గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంగళగిరి ఎమ్మార్వో ఆఫీసులో పెట్రోల్ తో రైతు హంగామా .. కారణం ఇదే

|
Google Oneindia TeluguNews

తెలుగురాష్ట్రాల ప్రజలు తహసిల్దార్ విజయ రెడ్డి సజీవ దహనం ఘటన ఇంకా మర్చిపోలేదు. తహసీల్దార్ విజయారెడ్డి దారుణ సజీవదహన ఘటన తరువాత వరుసగా తహసీల్దార్ ఆఫీసుల వద్ద పలు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తమ సమస్య పరిష్కారం కాకుంటే ప్రజలు పెట్రోల్ డబ్బాలతో ఎమ్మార్వో ఆఫీసులకు వెళ్ళటం పరిపాటిగా మారిపోయింది. తాజాగా మరో తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ బాటిల్ తో వెళ్ళిన ఓ రైతు అక్కడ సిబ్బందిని భయాందోళనకు గురి చేశారు.అయితే ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ లో జరిగింది.

తహసీల్దార్ ఆఫీస్ సిబ్బందిపై పెట్రోల్ చల్లిన రైతు.. కరీం నగర్ లో కలకలంతహసీల్దార్ ఆఫీస్ సిబ్బందిపై పెట్రోల్ చల్లిన రైతు.. కరీం నగర్ లో కలకలం

పట్టా దారు పాసు పుస్తకం ఇవ్వటం లేదని మంగళగిరి తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ బాటిల్‌తో ఓ రైతు హంగామా సృష్టించాడు . శివ కోటేశ్వరరావు అనే రైతు గత కొంత కాలంగా పట్టా దారు పాస్ బుక్ కోసం ఎమ్మార్వో ఆఫీసు చుట్టూ తిరిగారు. కానీ నేటికీ ఆయనకు ఆయన పొలానికి సంబంధించి పట్టాదారు పాస్ బుక్ రాలేదు. దీంతో కార్యాలయం చుటూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన చెందిన రైతు పెట్రోల్ డబ్బాలతో ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్ళారు.

Farmer creates tension with petrol in Mangalagiri MRO office .. The reason is

దీంతో కార్యాలయ సిబ్బంది అది గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో విసుగు చెందిన శివ కోటేశ్వరరావు నేడు ఎమ్మార్వో ఆఫీసుకు వస్తూ తన వెంట పెట్రోల్ బాటిల్ తెచ్చుకున్నాడు. ఆయన అధికారులపై దాడికి తెచ్చుకున్నారా ? లేకా ఆత్మహత్యా యత్నానికి తెచ్చుకున్నారా ? అన్నది పోలీసులు విచారిస్తున్నారు. పెట్రోల్ బాటిల్ గమనించి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు శివ కోటేశ్వర్ రావును అదుపులోకి తీసుకున్నారు.అయితే ఈ ఘటనతో ఎమ్మార్వో కార్యాలయ సిబ్బంది ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.

English summary
A farmer created a nuisance with a bottle of petrol in the office of Mangalagiri Tahsildar, saying that the officials did not give his pass book. Shiva Koteshwara Rao, a farmer, recently wandered around the MRO office for pass book. But to this day, he has not received a passbook regarding his farm. The agitated farmer went to the MRO office with petrol bottle. the office staff identified and surrendered him to the police .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X