గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ మెప్పు కోసం , విదిల్చే చిల్లర డబ్బుల కోసం ఇంత నీఛమా .... మార్ఫింగ్ ముఠాకు లోకేష్ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

గత ఎన్నికల్లో టిడిపి ఓటమి పాలైన నాటినుండి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్టైల్ మార్చారు. దూకుడు పెంచారు. మాటకు మాట సమాధానం చెప్పటం నేర్చుకున్నారు. ఎవరినైనా సరే వదిలిపెట్టేది లేదని తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే వైసిపి సర్కార్ పై ట్విట్టర్ వేదికగా మాటల తూటాలు పేలుస్తున్న నారా లోకేష్ ఇక తనపై తప్పుడు ట్వీట్లతో జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టే పనిలో పడ్డారు. సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నారు.

కౌలురైతుల కోసం కొత్త చట్టం... కౌలు రైతులకు పక్కా సాయం చేస్తానంటున్న జగన్కౌలురైతుల కోసం కొత్త చట్టం... కౌలు రైతులకు పక్కా సాయం చేస్తానంటున్న జగన్

 తప్పుడు ట్వీట్లతో తనపై జరుగుతున్న ప్రచారంపైనిప్పులు చెరుగుతున్న నారా లోకేష్

తప్పుడు ట్వీట్లతో తనపై జరుగుతున్న ప్రచారంపైనిప్పులు చెరుగుతున్న నారా లోకేష్


తప్పుడు ట్వీట్లతో తనపై జరుగుతున్న ప్రచారంపై మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. తాను మాట్లాడిన వాటిని వక్రీకరించడం, తాను చేసిన ట్వీట్లను మార్ఫింగ్ చేయడం.. ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం చేస్తున్నారని ఇక ఎవరైనా ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే చూస్తూ ఊరుకోం అని, అనవసరంగా ఊచలు లెక్కబెడతారు జాగ్రత్త అంటూ కాస్త గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు . జగన్ మెప్పు కోసం ఇలాంటి పనులు చేస్తే తిప్పలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

 లోకేష్ పోస్ట్ మార్ఫింగ్.... జగన్ కోసమే ఇదంతానా అని ఫైర్ అయిన లోకేష్

లోకేష్ పోస్ట్ మార్ఫింగ్.... జగన్ కోసమే ఇదంతానా అని ఫైర్ అయిన లోకేష్

ఇక అసలు విషయం ఏంటంటే మండపేటలో బాలుడి కిడ్నాప్ విషయంలో లోకేష్ పెట్టిన పోస్ట్ ను మార్ఫింగ్ చేసి తప్పుడు పోస్టు పెట్టారు మార్ఫింగ్ ముఠా. మండపేటలో బాలుడి కిడ్నాప్ తరువాత తల్లిదండ్రులు ఎంతటి ఆవేదనకు గురై ఉంటారో తనకు తెలిసిన లోకేష్ ఈ కిడ్నాప్ వ్యవహారం లో నేరస్తులకు శిక్ష పడాలి అని చేసిన పోస్ట్ ను మార్ఫ్ చేసి మండపేటలో బాలుడ్ని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్ల కు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం కావాలంటే గుడి దగ్గర వదిలిపెట్టి వెనుదిరిగి చూడకుండా పారిపోవాలని హెచ్చరించాము . ప్రజల మేలుకోరే నాలాంటి వాడే అసలైన నాయకుడు అంటూ లోకేష్ పోస్టు పెట్టినట్లుగా సోషల్ మీడియాలో ఒక పోస్టు చక్కర్లు కొడుతోంది. ఇక దీనిపై మండిపడుతున్న లోకేష్ ఒరిజినల్ పోస్ట్ ను ఫేక్ పోస్ట్ ను రెండింటినీ జతచేసి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. ఇక ఆ ట్వీట్ లో లోకేష్ చాలా ఘాటుగా స్పందించారు. ‘మీ జగనన్న విదిల్చే పేటీఎం చిల్లర కోసం మీరు ఎంతటి నీచానికైనా దిగజారతారనడానికి ఇదే నిదర్శనం. నేను అనని మాటలను చేర్చి ఏదో ఘనకార్యం సాధించినట్లు పైశాచికానందం పొందుతున్నారు. మీ అన్న మెప్పుకోసం ఇలాంటి పనులు చేస్తూ పోలీసులకు దొరికితే మాత్రం ఊచలు లెక్కపెడతారు జాగ్రత్త !'అంటూ ఘాటుగా స్పందించారు.

 గతలోనూ లోకేష్ పోస్ట్ ల మార్ఫింగ్.. ఊచలులెక్కిస్తారని సీరియస్ వార్నింగ్ ఇచ్చిన లోకేష్

గతలోనూ లోకేష్ పోస్ట్ ల మార్ఫింగ్.. ఊచలులెక్కిస్తారని సీరియస్ వార్నింగ్ ఇచ్చిన లోకేష్


గతంలోనూ లోకేష్ పేరుతో ఒక ట్వీట్ వైరల్ అయింది. లోకేష్ చాలా తెలివి తక్కువ వాడు అనే విషయం జనాలకు తెలిసేలా మార్ఫ్ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వరల్డ్ కప్ సమయాల్లో సెమీస్ లో భారత్, న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైన సమయంలో టీమిండియా సెమీఫైనల్లో ఓడిపోతే ఓడిపోయారు కానీ ఫైనల్లో కచ్చితంగా గెలవండి. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్న వారే అసలైన విజేతలు అంటూ నారా లోకేష్ ట్వీట్ చేసినట్లుగా మార్ఫింగ్ ట్వీట్ ఒకటి వైరల్ అయింది. ఇప్పుడు తాజాగా మండపేటలో బాలుడి కిడ్నాప్ కు సంబంధించి మరో ట్వీట్ ను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా లో వైరల్ చేస్తున్నారు. ఇలాంటి పోస్ట్ లు పెడుతున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోదా అంటూ ప్రశ్నిస్తున్న నారా లోకేష్ ఇదంతా జగన్ కుట్రగా అభివర్ణించారు. జగన్ విదిల్చే చిల్లర డబ్బుల కోసం మార్ఫింగ్ ముఠా ఇదంతా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అంతేకాదు ఊచలు లెక్క పెడతారంటూ చాలా గట్టిగానే హెచ్చరికలు జారీ చేశారు

English summary
Lokesh's post on the kidnapping of a boy in Mandapeta has been posting a false post by marfed gang .Lokesh tweeted this to the Twitter platform, combining both the original post and the fake post. Lokesh responded in a tweet. This is an example of how bad you can be for your Paytm retailer Jagan . I have been saying that I have accomplished something with the words that are saying. If you find yourself doing the same things for the sake of your brother, the police will be throw you behind the bars .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X