గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇంకా అదే మాట ... విలువలకు కట్టుబడ్డా అంటున్న కోడెల ... జనం నమ్ముతారా ?

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : ఏ పార్కులో చూసిన ఏమున్నది గర్వకారణం.. సమస్తం ప్రేమ పక్షుల నిలయం అన్న చందంగా తయారైంది పరిస్థితి. నగరంలో పార్కులకు కొదువ లేదు. అలాగని ప్రేమ జంటలకూ కూడా కొదువ లేదు. అలసి సొలసి కాసింత సేద తీరుదామని పార్కులకు వెళ్లే సగటు నగర జీవికి ఎంత కష్టం కష్టం.. ప్రేమ జంటల రూపంలో ప్రకృతిని ఆస్వాదించడానికి కూడా వీలు లేకుండా పోతోంది.

హైదరాబాద్ పార్కులంటే కొందరు భయపడతారు. కుటుంబ సమేతంగా వెళ్లాలంటే జంకుతారు. ఏ పార్కుకు వెళ్లినా ఫ్యామిలీల కంటే ప్రేమపక్షులే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అదే కోవలో హుస్సేన్ సాగర్ తీరంలోని సంజీవయ్య పార్కు.. లవ్ బర్డ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. చెట్టుకో జంట చొప్పున అదో మైకంలో మునిగి తేలుతున్న సన్నివేశాలు కనిపిస్తుంటాయి. అయితే ఇకపై అలా కుదరదంటూ అధికారులు తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది.

 బీజేపీ చేతిలో కొత్త అస్త్రం..౩౦ రోజుల యాక్షన్ ప్లాన్ తో కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్న బీజేపీ బీజేపీ చేతిలో కొత్త అస్త్రం..౩౦ రోజుల యాక్షన్ ప్లాన్ తో కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్న బీజేపీ

 అసెంబ్లీ సామాగ్రిలో విలువైన వస్తువుల నుండి ఆఖరికి ప్లాస్టిక్ కుర్చీలను సొంతానికి వాడుకున్న కోడెల

అసెంబ్లీ సామాగ్రిలో విలువైన వస్తువుల నుండి ఆఖరికి ప్లాస్టిక్ కుర్చీలను సొంతానికి వాడుకున్న కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్‌ సొంత అవసరాలకు వాడుకున్న వ్యవహారంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై కేసులు నమోదయ్యాయి . అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరించిన వ్యక్తి, అసెంబ్లీ ఫర్నిచర్‌ను సొంతానికి వాడుకున్నారంటూ అసెంబ్లీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడెల, ఆయన కుమారుడిపై తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసు దర్యాప్తులో భాగంగా కోడెల కుమారుడికి చెందిన గౌతమ్ హీరో షోరూమ్‌లోని అసెంబ్లీ ఫర్నిచర్‌ను సీజ్ చేశారు పోలీసులు . చాలా విలువైన వస్తువుల నుండి ఆఖరికి ప్లాస్టిక్ కుర్చీల వరకు తెచ్చుకున్న కోడెల శివప్రసాద్ చేసిన ఘనకార్యం ఇప్పుడు ఏపీ లో హాట్ టాపిక్ గా మారింది.

 రెండు కోట్ల విలువైన అసెంబ్లీ ఫర్నిచర్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు

రెండు కోట్ల విలువైన అసెంబ్లీ ఫర్నిచర్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు

కేసు దర్యాప్తులో భాగంగా సుమారు రెండు కోట్ల విలువైన అసెంబ్లీ ఫర్నిచర్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు స్వాధీనం చేసుకున్న వస్తువుల జాబితా చూసి షాక్ తిన్నారు . వాటిలో 70 లక్షల రూపాయల విలువైన డైనింగ్ టేబుల్ సెట్‌ నుంచి సాధారణ ప్లాస్టిక్ కుర్చీల వరకూ ఉన్నాయంటే కోడెల శివప్రసాద్ చేసిన ఘనకార్యం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.ఆఖరుకు ప్లాస్టిక్ కుర్చీలు కూడా వదలకుండా సొంత అవసరాలకు వాడుకున్నారు అంటే ఆయన ఏ మాత్రం నిజాయితీ పరుడో తెలుసుకోవచ్చు. అధికారాన్ని దుర్వినియోగం చేయడం విన్నాం కానీ, ఇంత దారుణంగా, ఇంత హీనంగా ప్లాస్టిక్ కుర్చీలు దగ్గరనుండి తీసుకెళ్లడం ఎవరు ఎక్కడ వినని చరిత్ర.

ఇక కోడెల తనయుడి గౌతమ్ షోరూమ్‌లో పోలీసులు సీజ్ చేసిన అసెంబ్లీ ఫర్నిచర్‌లో టేబుల్స్ విత్ సైడ్ ర్యాక్స్ 7, టీపాయ్ 1, డైనింగ్ టేబుల్ 1, త్రీ సీటర్ సోఫా సెట్లు 3, త్రీ సీటర్ ఐరన్ చైర్ల సెట్లు 3, కంప్యూటర్ టేబుల్ 1, బీఏసీ టేబుల్ టాప్ 1, ఉడెన్ కప్ బోర్డులు 2, గ్రీన్ చైర్లు 22, ఉన్నాయి. వాటితోపాటు వైట్ ప్లాస్టిక్ కుర్చీలు 27, బ్రౌన్ ప్లాస్టిక్ కుర్చీలు 9, పికాక్ చైర్లు 14, డైనింగ్ టేబుల్ గ్లాస్ 1 తదితర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తనను క్షోభ పెడుతున్నారన్న కోడెల ... ఇంకా విలువలు ఉన్నాయా అంటున్న ప్రజలు

తనను క్షోభ పెడుతున్నారన్న కోడెల ... ఇంకా విలువలు ఉన్నాయా అంటున్న ప్రజలు


ఇక ఈ విషయంపై స్పందించిన కోడెల శివప్రసాద్ గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఉన్న సామగ్రిని తీసుకెళ్లానని అసెంబ్లీ అధికారులకు లేఖలు రాసినా వారు స్పందించలేదని తెలిపారు. ఇక తన నిజాయితీ గురించి తానే చెప్పుకున్నారు.

జూన్ 7న ఒక లేఖ, ఆగస్ట్ 20న రెండో లేఖ రాశానని చెప్పారు. నేరుగా స్పీకర్ కు కూడా ఓ లేఖ రాశానని చెప్పిన ఆయన తనలేఖకు ఎవరూ స్పందించలేదని అన్నారు. ఇటీవలే తన కార్యాలయానికి వచ్చిన అధికారులు సామగ్రిని తీసుకెళ్లారని, ఇంకా ఏమైనా ఉంటే తీసుకెళ్లాలని చెప్పారు. అనవసరంగా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ క్షోభ పెట్టవద్దని కోరారు. 37 ఏళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నానని, విలువలకు కట్టుబడి జీవిస్తున్నానని చెప్పారు. అసలు అసెంబ్లీ ఫర్నీచర్ సొంత అవసరాలకు వాడుకోవటమే తప్పు .. అయితే ఇక ఈ విషయంలో తనను క్షోభ పెడుతున్నారని కోడెల వ్యాఖ్యానించటం జనాల సానుభూతి పొందలేదు అన్నది కోడెల తెలుసుకోవాల్సిన అంశం . తప్పు చేసి , తీరా దొరికాక క్షోభ పెడుతున్నారు అంటే ప్రజలు కూడా కోడెల స్టేట్ మెంట్ అంగీకరించేలా లేరు .

English summary
Kodela Sivaprasad, who carried assembly furniture for his personal use, claimed he was very sincere. Kodela Sivaprasad is taking his own liberty by admitting that it is true that he took the furniture of assembly for personnel purpose. And now he is stating that ycp government harrassing him and he is honest from 37 years in politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X