లోకేష్... ప్రెస్ మీట్ పెట్టి ఆ మూడు పదాలు సరిగ్గా పలుకు ముందు అంటున్న వైసీపీ ఎమ్మెల్యే

Recommended Video

    లోకేష్ పై విరుచుకు పడ్డ వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు || Sudhakar Babu Slammed Lokesh || Oneindia

    ఏపీలో రాజకీయ నాయకుల మధ్య మాట యుద్ధం కొనసాగుతుంది. ముఖ్యంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ వైసీపీ సర్కార్ ను, అలాగే సీఎం జగన్ ను, విజయసాయి రెడ్డి ని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈ రోజు ఆయన హనుమాన్ జంక్షన్ సీతారాంపురం వద్ద పట్టిసీమ నీటికి హారతి ఇచ్చి నారా లోకేశ్ ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనతరం మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ అసమర్ధతపై దుమ్మెత్తిపోశారు . ఇక టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ పై వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు సెటైర్లు వేశారు.

    ఆ నాలుగు పదాలు కరెక్ట్ గా పలకాలని లోకేష్ ను ఎద్దేవా చేసిన ఎమ్మెల్యే సుధాకర్ బాబు

    ఆ నాలుగు పదాలు కరెక్ట్ గా పలకాలని లోకేష్ ను ఎద్దేవా చేసిన ఎమ్మెల్యే సుధాకర్ బాబు

    నాలుగు పదాలను కూడా సరిగా పలకలేని లోకేశ్ జగన్, విజయసాయిరెడ్డిల గురించి మట్లాడటం విడ్డూరంగా ఉందని వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు అన్నారు. వైసీపీనేతలను విమర్శించే ముందు ప్రెస్ మీట్ పెట్టి మంగళగిరి, డెంగ్యూ, గుంటూరు పదాలను ముందు సరిగ్గా పలకాలని సవాల్ విసిరారు. లోకేష్ సరిగా మాట్లాడలేరని , ఒక నాలుగు పదాలే సరిగా మాట్లాడలేని లోకేష్ వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ , విజయసాయి రెడ్డిలపై వ్యాఖ్యలు చెయ్యటం విడ్డూరమేనని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా చంద్రబాబు, లోకేశ్ కు బుద్ధి రాలేదని అన్నారు. పదవుల కోసం ఎంతకైనా దిగజారుతారని సుధాకర్ బాబు విమర్శించారు.

    ఏపీ ప్రజలు 151 పాములను చంపారని , 23 పాములను వదిలేశారని సెటైర్లు

    ఏపీ ప్రజలు 151 పాములను చంపారని , 23 పాములను వదిలేశారని సెటైర్లు


    వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులపై బాధ్యతా రహితంగా చేసిన ప్రకటనలకు సంతనూతలపాడు ఎమ్మెల్యే టిజెఆర్ సుధాకర్ బాబు ఓ రేంజ్ లో టీడీపీ నేతలకు సెటైర్లు వేశారు. వైయస్ఆర్సిపి శాసనసభ్యులను, నాయకులను పాములతో పోల్చిన నారా లోకేష్ వ్యాఖ్యలను సుధాకర్ బాబు ఎగతాళి చేశారు. రాష్ట్ర ప్రజలు 151 పాములను చంపి పారేశారని , 23 పాములను మాత్రం బతికించారని తెలిపారు.

     టీడీపీ ఎమ్మెల్యేలను పాములని పేర్కొని రివర్స్ కౌంటర్ వేసిన సుధాకర్ బాబు

    టీడీపీ ఎమ్మెల్యేలను పాములని పేర్కొని రివర్స్ కౌంటర్ వేసిన సుధాకర్ బాబు

    పాములు ఎవరో స్పష్టంగా తెలుస్తుందన్న సుధాకర్ బాబు పాములు బయటకొచ్చాయని లోకేశ్ చెప్పిన మాట నిజమేనని... గత ఐదేళ్లలో చాలా పాములు బయటకు వచ్చాయని... వాటిని ప్రజలు చావగొట్టారని టీడీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి సుధాకర్ బాబు అన్నారు. కేవలం 23 పాములు మాత్రమే తప్పించుకున్నాయని... స్థానిక ఎన్నికల్లో ఏ ఒక్క అవినీతి పాము కూడా గెలవదని చెప్పారు. టీడీపీ నేతల అవినీతి భాగోతాన్ని అసెంబ్లీ సాక్షిగా బయటపెడతామని హెచ్చరించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+