గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాష్ట్రమంతా 144 సెక్షన్ అమలు చేస్తున్నారుగా ... విద్యార్థులపట్ల ఇంత కర్కశమా ... లోకేష్ ఫైర్

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో అరాచకం కొనసాగుతుంది అని టిడిపి భగ్గుమంటున్న విషయం తెలిసిందే. వైసిపి పాలనలో రాష్ట్రంలో ఆశా వర్కర్ల పరిస్థితి,ఇసుక కొరతతో నిర్మాణ రంగ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. మొన్నటికి మొన్న ఆశా వర్కర్ల విషయంలో ప్రభుత్వం అనచివేతలకు పాల్పడుతుంది అని మండిపడిన నారా లోకేష్ తాజాగా విద్యార్థుల సమస్యలపై జగన్ సర్కార్ ను నిలదీశారు.

ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆడేశాడు.. రాజకీయమైనా మైదానమైనా తగ్గేదే లేదంటున్న రేవంత్ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆడేశాడు.. రాజకీయమైనా మైదానమైనా తగ్గేదే లేదంటున్న రేవంత్

విద్యార్థులని పోలీసుల బూటుకాళ్ళతో తన్నిస్తారా? వీళ్ళకు చదువులు వద్దా?అని ప్రశ్నించిన నారా లోకేష్

విద్యార్థులని పోలీసుల బూటుకాళ్ళతో తన్నిస్తారా? వీళ్ళకు చదువులు వద్దా?అని ప్రశ్నించిన నారా లోకేష్

అప్పుడు అక్కా ఓటు, చెల్లెమ్మా ఓటు అన్నారు. ఇప్పుడు మాత్రం అందరిపై వేటు వేస్తూ అందకుండా పోతున్నారు అంటూ జగన్ పై విరుచుకుపడిన లోకేష్ జగన్ పై సెటైర్లు వేశారు. జగన్ గారూ! వరదలొచ్చి ప్రజలు అల్లాడుతుంటే ముఖ్యమంత్రిగా ఆదుకోవాల్సిన సమయంలో అమెరికా వెళ్ళొచ్చారు. ఈరోజు ఫీజు రీయింబర్స్ మెంటు, స్కాలర్ షిప్ బకాయిలు ఇవ్వండని అడిగిన విద్యార్థులని పోలీసుల బూటుకాళ్ళతో తన్నిస్తారా? వీళ్ళకు చదువులు వద్దా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎవరు ఏమి అడిగినా అణచివేత తప్ప ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదని లోకేష్ అభిప్రాయపడ్డారు. ఫీజు రీయింబర్స్ మెంటు, స్కాలర్ షిప్ బకాయిల కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల జులుం కు సంబంధించిన వీడియో పోస్ట్ చేసి ప్రస్తుత ప్రభుత్వ తీరును ఎండగట్టే ప్రయత్నం చేశారు .

ఫీజు రీయింబర్స్ మెంటు, స్కాలర్ షిప్ బకాయిలు అడిగితే కొడతారా అని ప్రశ్న

ఫీజు రీయింబర్స్ మెంటు, స్కాలర్ షిప్ బకాయిలు అడిగితే కొడతారా అని ప్రశ్న


"మేము మీకు అన్యాయం చేస్తాం. మీరు మాత్రం ఆందోళన చేయడానికి వీల్లేదు" అనే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య చరిత్రలో మొదటిసారిగా దేశం చూస్తోంది అంటూ ద్వజమెత్తారు లోకేష్ . రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఎవరు ఏమి అడిగినా నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆశాకార్యకర్తలు ఆందోళనచేస్తే వాళ్ళ కుటుంబసభ్యుల్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి బెదిరిస్తారా? అని ప్రశ్నించిన లోకేష్ ఇప్పుడు విద్యార్థులపట్ల ఇలా కర్కశంగా వ్యవహరిస్తారా? అంటూ నిప్పులు చెరిగారు.

విద్యార్థుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేసిన నారా లోకేష్

విద్యార్థుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేసిన నారా లోకేష్

అంతే కాదు ఇన్నాళ్లు మీ ఇంటి దగ్గరే 144 సెక్షన్ అనుకున్నాం, రాష్ట్రమంతా 144 సెక్షన్ అమలు చేస్తున్నారుగా! అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొందని ఆయన అభిప్రాయపడ్డారు. నిరంకుశ విధానాలతో జగన్ సర్కార్ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. విద్యార్థుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని తెలుగుదేశం డిమాండ్ చేస్తోందని పేర్కొన్న నారా లోకేష్ వారికి న్యాయం జరిగేవరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని తేల్చి చెప్పారు.

English summary
Lokesh said the country is seeing for the first time in the history of democracy a government that "we will do you injustice. You are not allowed to worry". He said that the YCP government in the state is trying to shut the mouth of anyone who asks. lokesh outrage on jagan's government now acts harshly towards the students
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X