ఎన్టీఆర్ విగ్రహాం ధ్వంసం: ప్రతిమ కాదు, ప్రజల మనసుల్లో కొలువైన దైవం, సర్కార్‌పై లోకేశ్ ఫైర్..
గుంటూరు జిల్లా తెనాలిలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. జగన్ సర్కార్ సైకో మనస్తత్వంతో ముందుకెళ్తుందని మండిపడ్డారు. ఎన్టీఆర్ విగ్రహాం ధ్వంసం చేసి రాక్షస ఆనందం పొందారని లోకేశ్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇది సరికాదంటూనే.. వైసీపీ శ్రేణులపై విరుచుకుపడ్డారు.
కూలగొడితే కూలిపోవడానికి అవీ విగ్రహాలు కాదన్నారు. మీ సంకుచిత బుద్దితో ధ్వంసం చేసినంత మాత్రాన పోవడానికి అదీ స్టాచూ కాదన్నారు. ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకొన్న ఎన్టీఆర్ అని.. వారి పాలిట దైవం అని పేర్కొన్నారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహాలు లేకుండా చేయాలని జగన్ సర్కార్ భావిస్తుందని మండిపడ్డారు. విగ్రహాలు లేకుండా చేసి ప్రజలకు దూరం చేయగలమని సైకో మనస్తత్వంతో ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారని ధ్వజమెత్తారు.
కూలగొడితే కూలిపోవడానికి, ధ్వంసంచేస్తే ధ్వంసమైపోవడానికి ఆయన విగ్రహం కాదు ప్రజల మనస్సులో కొలువైన దైవం. స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి విగ్రహాలు లేకుండా చెయ్యడం ద్వారా ప్రజలకు ఆయన్ని దూరం చెయ్యగలమని సైకో మనస్తత్వంతో @ysjagan గారు, వైకాపా నాయకులు అనుకుంటున్నారు.(1/2) pic.twitter.com/YvplFnsVti
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) August 21, 2020

Recommended Video
ఎన్టీఆర్‌ను ప్రజల నుంచి దూరం చేయడం మీ వల్ల కాదని లోకేశ్ అన్నారు. ఆయన ప్రజల మదిలో ఎప్పుడూ మెదలుతూనే ఉంటారని చెప్పారు. విగ్రహాం ధ్వంసం చేసి పాక్షికంగా పైశాచిక ఆనందం పొందొచ్చని చెప్పారు. తెనాలిలో ఎన్టీఆర్ విగ్రహాం ధ్వంసం చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వారిని కఠింగా శిక్షించాలని జగన్ ప్రభుత్వాన్ని కోరారు.












Click it and Unblock the Notifications