గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శోభనం అంటే భయంతో, వరుడు సూసైడ్.. వధువుకు గుండెకోత, పేరంట్స్‌కు కడుపుకోత..

|
Google Oneindia TeluguNews

పెళ్లి అంటే నూరెళ్ల పంట.. పెళ్లితో ఇద్దరు మనుషుల మనసులు కలిసి ఒక్కటవుతారు. ఆ అబ్బాయి వంశవృద్ది జరుగుతుంది. పెళ్లయ్యాక.. హిందూ సాంప్రదాయంలో అయితే శోభనానికి మంచి ముహూర్తం పెడతారు. ఆ సమయంలో కలిస్తే మంచిదని విశ్వసిస్తారు. ఇదీ ఎప్పటినుంచో వస్తోన్న ఆచారం.. అయితే శోభనం అంటే అమ్మాయి భయపడటం.. కామన్.. కానీ ఇప్పుడు అంతా ట్రెండ్ మారింది. భయం లేదు, భక్తి లేదు అన్నట్టు తయారయ్యింది సమాజం.. అందరూ కాదు కొందరే.. కానీ గుంటూరు జిల్లాలో ఇందుకు విరుద్దంగా ఓ ఘటన జరిగింది.

ఎంతపని చేశావ్ కిరణ్..

ఎంతపని చేశావ్ కిరణ్..

ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా మాచర్ల సాగర్‌ రింగ్‌రోడ్‌కు చెందిన సత్యనారాయణరాజు, విజయలక్ష్మిల కుమారుడు పత్తిగుడుపు కిరణ్‌కుమార్‌‌.. ఈయనకు ఈ నెల 11వ తేదీన గుంటూరు జిల్లా తెనాలి వించిపేటకు చెందిన యువతితో వివాహం జరిగింది. కొత్త జంట శోభనానికి ఈ నెల 16వ తేదీన పెద్దలు ముహూర్తం కుదిర్చారు. వరుడు కిరణ్‌కుమార్‌ తన పేరంట్స్‌తో కలసి మాచర్ల నుండి బయలు దేరి గుంటూరులో బస్సు దిగాడు. ఇప్పుడే వస్తానని పేరంట్స్‌కు చెప్పి వెళ్ళిపోయాడు. తిరిగిరాలేదు. ఫోన్ చేయగా స్విఛ్ ఆఫ్ వచ్చింది. అతని గురించి బంధువులకు చెప్పి తెనాలి వెళ్లిపోయారు.

కుళ్లిపోయిన కిరణ్ మృతదేహం

కుళ్లిపోయిన కిరణ్ మృతదేహం

కృష్ణానది ఎగువ ప్రాంతంలో మృతదేహం ఉందని తాడేపల్లి పోలీసులకు సమాచారం అందింది. బయటకు తీసి పరిశీలించారు. పూర్తిగా కుళ్లిపోయి కనిపించింది. జేబులోని సెల్ ఫోన్ పరిశీలించి సిమ్ కార్డు తీసి మొబైల్‌లో వేసి కిరణ్ కుమార్ వివరాలు సేకరించారు. అతని పేరంట్స్‌కు సమాచారం ఇవ్వగా.. మృతదేహం కిరణ్‌ది అని గుర్తించారు. మృతికి గల కారణాలను ఆరా తీయగా విస్తుపోయే సమాధానం వచ్చింది. శోభనం అంటే భయంతో కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. ధైర్యం చెప్పాలని అతడి స్నేహితులకు చెప్పామని.. కానీ మనసులో భయం పెట్టుకొని ఇలా చేశాడని విలపించారు.

ఫస్ట్ నైట్ అంటే భయం

ఫస్ట్ నైట్ అంటే ఉన్న భయం, తల్లిదండ్రులను ఒంటరివారిని చేసింది. అంతేకాదు నవ వధువు నిండునూరేళ్ల జీవితం.. పారాణి ఆరకముందే కరిగిపోయింది. పెళ్లయిన వారం రోజులకే భర్త ఆత్మహత్య చేసుకోవడంతో ఆ వధువు పరిస్థితి వర్ణణాతీతంగా మారింది. భయం ఉంటే చెప్పాలి.. వద్దని చెప్పాలి లేదంటే.. కొంచెం సమయం తీసుకోవాలి.. కానీ ఇలా చేసి కన్నవారికి కడుపుకోత.. వధువుకు గుండెకోత మిగిల్చాడు కిరణ్.

కిరణ్.. ఇలా ఎందుకు

కిరణ్.. ఇలా ఎందుకు

ఇప్పుడు సొసైటీ మారింది. స్కూల్, కాలేజ్ డేలలో స్టూడెంట్స్ ఎంజాయ్ చేస్తున్నారు. తర్వాత అన్నీ మరచిపోతున్నారు. ఇందుకు కారణం.. మీడియా, సోషల్ మీడియా. కానీ కిరణ్ పరిస్థితి మాత్రం విడ్డూరంగా ఉంది. శోభనం కోసం పెళ్లయిన మగాళ్లు ఎదురుచూస్తుంటే.. అతను మాత్రం తనువు చాలించాడు. అలా అయితే వివాహం చేసుకొని ఉండకపోతే బాగుండు అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే.. గంపెడాశతో వివాహం చేసుకున్న వధువు పరిస్థితి ఏమిటని అడుగుతున్నారు.

English summary
a newly married groom suicide fear of first night. bride and his parents are suffered. incident happened at guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X