గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సంగం డెయిరీ కేసు: ధూళిపాళ్ళ నరేంద్ర ఏసీబీ కస్టడీ ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు

|
Google Oneindia TeluguNews

సంగం డెయిరీలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై టిడిపి నేత,మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో పాటుగా, సంగం డెయిరీ ఎండి గోపాలకృష్ణ, సహకార శాఖ మాజీ అధికారి గురునాథంను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సంగం డెయిరీలో అవకతవకలపై మరింత లోతుగా విచారణ చేయాలని నిందితులను కస్టడీకి కోరుతూ ఏసీబీ అధికారులు, ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానాన్ని చేసిన విజ్ఞప్తిపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏసీబీ ప్రత్యేక కోర్టు. ఏసీబీ కోర్టు ఉత్తర్వులపై ఏపీ హైకోర్టు స్పందించింది.

సంగం డెయిరీ కేసు: ఏసీబీ కస్టడీలో ధూళిపాళ్ళ , ఏసీబీ ఆఫీస్ వద్ద కంటతడి పెట్టిన నరేంద్ర కుటుంబంసంగం డెయిరీ కేసు: ఏసీబీ కస్టడీలో ధూళిపాళ్ళ , ఏసీబీ ఆఫీస్ వద్ద కంటతడి పెట్టిన నరేంద్ర కుటుంబం

ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేసిన ఏపీ హైకోర్టు

ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేసిన ఏపీ హైకోర్టు

ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. నిందితులను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని పేర్కొన్న న్యాయస్థానం ఈ కేసులో తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.నిన్నటికి నిన్న ఏసీబీ అధికారులు విచారణ నిమిత్తం ధూళిపాళ్ల నరేంద్ర ను విజయవాడలోని ఏసీబీ కార్యాలయానికి తీసుకువచ్చే క్రమంలో, ఆయనను కలవడానికి వచ్చిన కుమార్తె, తండ్రితో మాట్లాడడానికి వీలు కల్పించకపోవడంతో రాజమండ్రిలో కంటనీరు పెట్టుకున్నారు.

నిన్న విజయవాడ ఏసీబీ కార్యాలయం వద్ద ధూళిపాళ్ళ కుటుంబం ఆరోపణలు

నిన్న విజయవాడ ఏసీబీ కార్యాలయం వద్ద ధూళిపాళ్ళ కుటుంబం ఆరోపణలు


ఇక విజయవాడ ఏసీబీ ఆఫీస్ కు చేరుకున్న ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబం ధూళిపాళ్ళ నరేంద్ర పై తప్పుడు కేసులు పెట్టారని, సీఎం జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ తీరుపై కన్నీటిపర్యంతమయ్యారు. ఇక న్యాయవాదిని కూడా కలవకుండా అడ్డుకోవటంతో తీవ్ర వాగ్వాదం తర్వాత న్యాయవాది ధూళిపాళ్ళ నరేంద్రతో మాట్లాడారు.నిన్నధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ కార్యాలయానికి తీసుకువెళ్లి 5గంటల పాటు విచారించారు.

తొలిరోజు 5 గంటల విచారణ, తాజాగా హైకోర్టు ఉత్తర్వులు

తొలిరోజు 5 గంటల విచారణ, తాజాగా హైకోర్టు ఉత్తర్వులు

ధూళిపాళ్ల నరేంద్ర విచారణలో భాగంగా తొలిరోజు ఐదు గంటలకు పైగా ఏసీబీ కార్యాలయంలో జరిగిన విచారణలో సంగం డెయిరీ కార్యకలాపాలు చైర్మన్ గా నరేంద్ర బాధ్యతలు ఎప్పుడు స్వీకరించారు.అంతకుముందు ధూళిపాళ్ళ నరేంద్ర తండ్రి హయాంలో ఎన్ని సంవత్సరాలు డెయిరీ కార్యకలాపాలు సాగించింది తదితర అంశాలపై తొలిరోజు ప్రాథమిక విచారణ చేపట్టారు.5 గంటల పాటు విచారించిన అనంతరం నరేంద్రను విజయవాడ సబ్ జైల్ కి తరలించారు. ఇక తాజాగా హైకోర్టు ఏసీబీ ప్రత్యేక కోర్టు ఇచ్చిన కస్టడీ ఉత్తర్వులను నిలిపివేసి వారిని తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని ఆదేశించింది.

English summary
ACB officials have taken into custody Dhulipalla Narendra,arrested in the Sangam Dairy case in Andhra Pradesh. The AP High Court has recently issued orders suspending the execution of orders issued by the ACB special court for the custody of the accused.The high court adjourned the next hearing in the case to Monday, saying the accused should be shifted to Rajahmundry Central Jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X