గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసీపీ ఎమ్మెల్యేకు త‌హ‌సీల్దార్ అల్టిమేటం:జాయింట్ క‌లెక్ట‌ర్..ప్ర‌జ‌ల‌ సాక్షిగా: ఎమ్మెల్యే..

|
Google Oneindia TeluguNews

ఎక్క‌డైనా అధికారులు అధికారంలో ఉన్న వారు షాక్‌లు ఇస్తారు. కానీ, ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే..అందునా జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ స‌మక్షంలో ఏకంగా ఒక త‌హ‌సీల్దార్ జ‌ల‌క్ ఇచ్చిన ఘ‌ట‌న ఇది. అధికారులు ప‌ని చేయ‌క‌పోతే తాను క‌లెక్ట‌రేట్ వ‌ద్ద ధ‌ర్నా చేస్తాన‌ని ఎమ్మెల్యే హెచ్చ‌రిస్తే..దీనికి ప్ర‌తిగా మీరు ధ‌ర్నా చేయ‌టం కాదు..నేనే మండ‌లం నుండి వెళ్లిపోతానంటూ అల్టిమేటం ఇచ్చారు. దీంతో..ఎమ్మెల్యే అవాక్క‌య్యారు. ఎమ్మెల్యేల‌..త‌హ‌సీల్దార్ మ‌ధ్య వాగ్వాదం కొన సాగుతుండటంతో జాయింట్ క‌లెక్ట‌ర్ జోక్యం చేసుకోని స‌ర్దుబాటు చేసారు.

ఎమ్మెల్యే.. త‌హ‌సీల్దార్ మ‌ధ్య వాగ్వాదం
గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యేకు ఊహించ‌ని ప‌రిణామం ఎదురైంది. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో జరిగిన జలశక్తి అభియాన్‌ కార్యక్రమం సందర్భంగా శాసనసభ్యుడు బొల్లా బ్రహ్మనాయుడు, తహసీల్దార్‌ బి.బాలకృష్ణ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జాయింట్‌ కలెక్టర్‌ సత్యనారాయణ సాక్షిగా ఈ వివాదం చోటు చేసుకుంది. బొల్లాపల్లి మండలంలో ఎన్నో ఏళ్లుగా సర్వే నంబర్ల సమస్య ఉందిని ప్ర‌స్తావించిన ఎమ్మెల్యే బ్ర‌హ్మ నాయుడు మండలంలో సుమారు 900 సర్వే నంబర్లు ఉండగా ప్రభుత్వం రెవెన్యూ అధికారుల ప్రకారం గ్రామాలను బట్టి 360 నుంచి 390 వరకు మాత్రమే రికార్డులు ఉన్నాయని.. మిగిలిన సర్వే నంబర్లకు రికార్డులు లేవని వివ‌రించారు. తొమ్మిది వందల వరకు ఉన్న సర్వే నంబర్లను ఆన్‌లైన్‌ చేయాలి... అంటూ ఎమ్మెల్యే ఇటీవల శాసనసభలో ప్రస్తావించారు. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ హామీ ఇచ్చారు.

Tahasildar ultimatum to YCP MLA Bolla Brahma Naidu in Vinukonda Constituency in Guntur dist.

త‌హ‌సీల్దార్ స‌మాధానం విని..
ఇక ఈ సభలో ఎమ్మెల్యే బొల్లా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ సమస్య నెల రోజుల్లో పరిష్కారం కాకపోతే రైతులతో వచ్చి కలెక్టరేట్‌ ముందు ధర్నా చేస్తాన‌ని హెచ్చ‌రించారు. అందుకు తక్షణమే స్పందించిన తహసీల్దార్‌ బాలకృష్ణ తాను బదిలీపై వచ్చి 10 రోజులే అయిందనీ, ఇప్పటివరకు తన వద్ద పెండింగ్‌లో ఎలాంటి సమస్యలూ లేవన్నారు. నిబద్ధత, నిజాయతీ చూసి కలెక్టర్‌ ఏరికోరి బొల్లాపల్లికి బదిలీ చేశారని వివ‌రించారు. తాను ఇక్క‌డ ప‌ని చేయ‌టం ఇష్టం లేక‌పోతే వెళ్లడానికి సిద్ధమని బదులివ్వడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. కాగా తాను వెళ్లమని చెప్పడం లేదని, సమ స్యను పరిష్కరించాలని మాత్రమే చెబుతు న్నానని ఎమ్మెల్యే బొల్లా చెప్పుకొచ్చారు. బహిరంగ వేదికపై తహసీల్దార్‌, ఎమ్మెల్యే వాగ్వాదంతో అంద‌రూ ఆశ్చ‌ర్య పోయారు. దీంతో.. జాయింట్‌ కలెక్టర్‌ సత్యనారాయణ జోక్యం చేసుకొని నరసరావుపేట ఆర్డీవోతో చర్చించి రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తామని చెప్పడంతో వివాదం సద్ద్దుమణిగింది. దీని పైన ఎమ్మెల్యే ఈ వ్య‌వ‌హారాన్ని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు స‌మాచారం.

English summary
Tahasildar ultimatum to YCP MLA Bolla Brahma Naidu in Vinukonda Constituency in Guntur dist. Tahasildar serious reply to MLA on his demand.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X