అంబటి రాంబాబుకు సొంత పార్టీ కార్యకర్తల షాక్- అక్రమ మైనింగ్‌పై హైకోర్టులో పిల్..
గుంటూరు జిల్లా సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు సొంత పార్టీ కార్యకర్తలే షాకిచ్చారు. అదీ సొంత నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలే. ఏకంగా తమ ఎమ్మెల్యే అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారంటూ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర సంచలనం రేపుతోంది.
సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్న అంబటి రాంబాబు తన నియోజకవర్గం పరిధిలోకి వచ్చే రాజుపాలెం మండలం నెమలిపురి, కొండమోడులో అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో ఇవాళ ఓ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. హైకోర్టు న్యాయవాది నాగరఘు ఈ వాజ్యం దాఖలు చేశారు. అయితే ఈ వాజ్యం తాను వైసీపీ కార్యకర్తల తరఫున దాఖలు చేస్తున్నట్లు చెప్పడంతో సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమైంది. అధికార పార్టీ అయిన వైసీపీ కార్యకర్తలే పిటిషన్ వేస్తే అది ప్రజాప్రయోజన వాజ్యం ఎలా అవుతుందంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు. దీంతో వెంటనే దీనిపై నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Recommended Video
ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నట్లు కలెక్టర్, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎం జగన్‌కు పిటిషన్లు పంపినా పట్టించుకోలేదని వైసీపీ కార్యకర్తలు ఈ పిటిషన్‌లో ఆరోపించడం విశేషం. ఈ వ్యవహారంపై ఇప్పటికే స్ధానిక మైనింగ్ అధికారులు విచారణ జరిపారని కూడా పిటిషన్‌లో వీరు పేర్కొన్నారు. దీంతో దీనిపై పూర్తి నివేదిక కోరుతూ కేసు విచారణను వచ్చే నెలకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి ప్రకటించారు.
-
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
ఏపీ విద్యార్ధులకు సర్కార్ గుడ్ న్యూస్..! దేశంలో తొలిసారి..! -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications