గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లోకేశ్ సమీపంలో పెద్ద రాయి.. ఎల్లో బ్లడ్ అంటూ యువనేత చిందులు

|
Google Oneindia TeluguNews

గుంటూరు జిల్లాలో గల తుమ్మపూడిలో ఓ మహిళ దారుణ హత్యకు గురయిన సంగతి తెలిసిందే. అయితే ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు నారా లోకేశ్ వెళ్లారు. అయితే అక్కడ వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లోకేశ్‌తో పాటు టీడీపీ శ్రేణుల‌పై వైసీపీ కార్య‌క‌ర్త‌లు రాళ్ల దాడి చేశారు. హ‌త్యాచార బాధితురాలి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు నారా లోకేశ్ వ‌చ్చార‌ని తెలుసుకున్న ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి అనుచ‌రులు అక్క‌డికి చేరుకున్నారు. ఇరు వ‌ర్గాల మ‌ధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది.

లోకేశ్ సమీపంలో పడిన రాయి..

లోకేశ్ సమీపంలో పడిన రాయి..


ఆ త‌ర్వాత వైసీపీ శ్రేణులు నారా లోకేశ్‌తో పాటు టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌పైకి రాళ్లు రువ్వ‌ారు. నారా లోకేశ్ నిలుచున్న చోట.. అతి స‌మీపంలోనే పెద్ద రాయి వ‌చ్చి ప‌డింది.
పోలీసులు వారిస్తున్నా విన‌ని వైసీపీ శ్రేణులు రాళ్ల దాడికి దిగాయి. వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. హ‌త్యాచార బాధితురాలి కుటుంబాన్ని ప‌రామర్శించేందుకు వ‌చ్చిన త‌న‌పై వైసీపీ శ్రేణులు రాళ్ల దాడికి దిగాయ‌ని చెప్పారు. ఈ విధంగా దాడుల‌ు చేస్తే భ‌య‌ప‌డేది లేద‌ని తేల్చి చెప్పారు.

పోలీసులు ఏం చేస్తున్నారు..

పోలీసులు ఏం చేస్తున్నారు..


త‌మపై రాళ్ల దాడి జ‌రుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నార‌ని లోకేశ్ ప్ర‌శ్నించారు. ప‌ది మంది ఆందోళ‌న‌కారుల‌ను కూడా అడ్డుకోలేని ప‌రిస్థితిలో పోలీసులు ఉన్నారని మండిపడ్డారు. రాళ్ల దాడిలో భాగంగా త‌న మీద‌కు దూసుకువ‌చ్చిన రాయిని చూపుతూ పోలీసుల‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. హ‌త్యాచార బాధితురాలి మృత‌దేహానికి శ‌వ ప‌రీక్ష జ‌ర‌గ‌క‌ముందే... ఆమెపై అత్యాచారం జ‌ర‌గలేద‌ని గుంటూరు అర్బ‌న్ ఎస్పీ ఎలా చెబుతార‌ని లోకేశ్ ప్ర‌శ్నించారు. అలా చెప్పాల‌ని ఎస్పీపై ఒత్తిడి చేశారా? అని ప్ర‌శ్నించారు. స‌జ్జ‌ల ఎస్పీని ఒత్తిడికి గురి చేశారా? అని ప్ర‌శ్నించారు.

ఎల్లో బ్లడ్

ఎల్లో బ్లడ్


త‌మ‌ది పేటీఎం బ్యాచ్ కాద‌ని లోకేశ్ అన్నారు. త‌మ‌ది ఎల్లో బ్ల‌డ్ అని... ఏ ఒక్క‌రికీ భ‌యప‌డేది లేద‌ని తేల్చి చెప్పారు. హ‌త్యాచారంపై చ‌ర్య‌లు తీసుకునేందుకు వైసీపీ ప్ర‌భుత్వానికి 21 రోజులు గడువు ఇస్తున్నాన‌ని చెప్పారు. ఆ లోపు నిందితుల‌కు ఉరిశిక్ష వేయ‌గ‌ల‌రా? అని ప్ర‌శ్నించారు. దిశ చట్టం ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఏ ఒక్క మృగాడికి అయినా శిక్ష వేశారా అని అడిగారు.

English summary
ysrcp workers stone pelting to nara lokesh. incident happened at guntur tummapudi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X