హిందూపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎవడు ఆపుతాడో చూస్తాం: హిందూపురంలో బాలకృష్ణ పర్యటన, వైసీపీ సర్కారుపై ఫైర్

|
Google Oneindia TeluguNews

అనంతపురం: ఏపీ సర్కారుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. రాష్ట్రంలో దళిత మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. హిందూపురం నియోజకవర్గంలో మూడో రోజు బాలకృష్ణ పర్యటన కొనసాగింది.

బాలకృష్ణ, లోకేష్‌లు లక్ష్యంగా రోజా: కోర్టుకు ఎందుకంటూ చంద్రబాబుపై బొత్స ఫైర్బాలకృష్ణ, లోకేష్‌లు లక్ష్యంగా రోజా: కోర్టుకు ఎందుకంటూ చంద్రబాబుపై బొత్స ఫైర్

ఈ సందర్భంగా పట్టణ పరిధిలో టీడీపీ హయాంలో రూ. 300 కోట్ల వ్యయంతో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులతో కలిసి పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలను మధ్యలోనే వదిలేసి లబ్ధిదారులకు ప్రభుత్వం అన్యాయం చేసిందని అన్నారు. ప్రభుత్వం పట్టించుకోకుంటే తామే ఇళ్ల నిర్మాణాలు పూర్తి పేదలకు అందజేస్తామని అన్నారు.ఎవడాపుతాడో చూస్తామని బాలకృష్ణ అన్నారు.

Nandamuri Balakrishna tour in hindupur: fires at ysrcp government.

లబ్ధిదారులతో కలిసి నా ఇళ్లు నా సొంతం అంటూ బాలకృష్ణ నినాదాలు చేశారు.
పేదవాడి సొంతింటి కలను సాకారం చేస్తామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అనువుకాని చోట దూర ప్రాంతాల్లో స్థలం ఇచ్చి వారిని ఇబ్బందులకు గురిచేస్తోందని విమర్శించారు.

రాష్ట్రంలో ఎక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరిగినా టీడీపీ నేతలపైనే అక్రమ కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని బాలకృష్ణ హెచ్చరించారు.

శాంతికి మారుపేరుగా ఉన్న హిందూపురంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకంగా మారుస్తున్నారని శుక్రవారం పర్యటన సందర్భంగా వ్యాఖ్యానించారు. కొడిపి వద్ద నిర్మిస్తున్న టిడ్కో జి+3 ఇళ్లను పరిశీలించి, లబ్ధిదారులతో కలిసి నిరసన తెలిపారు. హిందూపురంలో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని, మట్కాకు స్థానిక వైసీపీ నాయకులు ఆర్థికంగా చేయూత ఇస్తున్నారని ఆరోపించారు. మాట వినని అధికారులను బదిలీ చేస్తున్నారని, డివిజన్‌లో డీఎస్పీ, సీఐలతోపాటు ఐదు నెలల వ్యవధిలో ఐదుగురు మున్సిపల్ కమిషనర్లను మార్చిన ఘనత వైసీపీదేనన్నారు.

English summary
Nandamuri Balakrishna tour in hindupur: fires at ysrcp government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X