మంత్రి పెద్దిరెడ్డి మాట కూడా బేఖాతర్?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని విభేదాలు మరోసారి రోడ్డెక్కాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో నాయకుల మధ్య కుమ్ములాటలు తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలోనే నాయకులు ఒకర్నొకరు బాహాబాహీకి దిగుతున్నారు. సీనియర్ మంత్రిగా పెద్దిరెడ్డి చెబుతున్న సూచనలను కూడా ఎవరూ పాటించడంలేదు. హిందూపురం వైసీపీలో నాయకుల మధ్య అంతర్గత కుమ్ములాటలు ప్రతిసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా ఆగ్రోస్ చైర్మన్ నవీన్ నిశ్చల్ తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మీడియాతో మాట్లాడారు. వైసీపీలో వలసదారులకు టికెట్లు ఇవ్వొద్దని అధిష్టానాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. వైసీపీ కార్యకర్తలందరూ కలిసి వలసదారులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

హిందూపురం నేత, ఎమ్మెల్సీ ఇక్బాల్ కు వ్యతిరేకంగా ఒక్కొక్కరు గళం విప్పుతున్నారు. తాజాగా నవీన్ నిశ్చల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈ వలసదారులంతా పార్టీ వీడతారన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ ఇక్బాల్ ది కర్నూలు జిల్లా. కొంతకాలంగా నిశ్చల్, ఇక్బాల్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఎంపీ మాధవ్ ను, ఇక్బాల్ ను ఉద్దేశించి నిశ్చల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. హిందూపురం నియోజకవర్గానికి ముఖ్య నాయకుడిగా ఉన్న చౌళూరు రామకృష్ణారెడ్డినే హత్య చేసేంతగా విభేదాలు తీవ్రతరమయ్యాయి. ఈ కేసులో ఇక్బాల్ పీఏను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో నవీన్ నిశ్చల్ వ్యాఖ్యలపై వైసీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందనేది చూడాలి మరి.
-
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!!












Click it and Unblock the Notifications