హిందూపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాలకృష్ణకు జగన్ సర్కార్ షాక్ .. హిందూపురంలో మెడికల్ కాలేజ్ లేనట్టే.. పెనుగొండలోనే ఏర్పాటు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్లోని జగన్ సర్కార్ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు భారీ షాక్ ఇచ్చింది. గతంలో హిందూపురంలో మంజూరైన మెడికల్ కాలేజీని రద్దు చేసి, మెడికల్ కాలేజీని పెనుగొండ నియోజకవర్గానికి తరలించి టిడిపి నేత బాలకృష్ణకు పెద్ద ఝలక్ ఇచ్చింది. హిందూపురం నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం స్థలాన్ని కూడా సేకరించి, సిద్ధం చేసినప్పటికీ బాలయ్య నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు నో అంది ఏపీ సర్కార్.

 టీడీపీ హయాంలో హిందూపురం మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు అనుమతి

టీడీపీ హయాంలో హిందూపురం మెడికల్ కాలేజ్ ఏర్పాటుకు అనుమతి

ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే హిందూపురం పార్లమెంటు పరిధిలో మాత్రం మెడికల్ కళాశాల ఏర్పాటు పై వివాదం నెలకొంది. హిందూపురంలో మెడికల్ కాలేజీ వివాదం తెలుగుదేశం పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రత్యక్ష పోరాటానికి వేదికగా మారింది. హిందూపురంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడానికి గత టీడీపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ములుగూరు వద్ద మెడికల్ కళాశాల కోసం స్థల సేకరణ కూడా జరిగింది.

స్థల సేకరణ కూడా చేసినా పెనుగొండలో ఏర్పాటుపై దృష్టి పెట్టిన ఏపీ సర్కార్

స్థల సేకరణ కూడా చేసినా పెనుగొండలో ఏర్పాటుపై దృష్టి పెట్టిన ఏపీ సర్కార్


ములుగూరు లో మెడికల్ కళాశాల నిర్మాణం కోసం ఎమ్మెల్యే బాలకృష్ణ గత ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు సైతం రాశారు. హిందూపురం నియోజకవర్గంలో అన్ని వసతులతో కూడిన ప్రభుత్వాస్పత్రి ఉందని, మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని గతంలో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందన్న విషయాన్ని ఆ లేఖలలో పేర్కొన్నారు.

ఇక ఆందోళనలతో ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది టిడిపి . ఒక టిడిపి మాత్రమే కాకుండా ప్రతిపక్ష పార్టీలు కూడా హిందూపురంలో మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం పట్టుబట్టాయి.

ఫలించిన మంత్రి శంకర్ నారాయణ ప్రయత్నాలు .. పెనుగొండ సమీపంలో ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

ఫలించిన మంత్రి శంకర్ నారాయణ ప్రయత్నాలు .. పెనుగొండ సమీపంలో ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్

స్థలాన్ని కూడా సేకరించిన తరువాత కళాశాలను ఏర్పాటు చేయకుండా ఇతర నియోజకవర్గాలకు తరలించటం సమంజసం కాదని ఆందోళన వ్యక్తం చేశాయి. ఇక హిందూపురం మెడికల్ కళాశాల విషయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ అహ్మద్ కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. అయితే జిల్లాల పునర్విభజన కమిటీ సూచనల మేరకు మెడికల్ కళాశాలను పెనుగొండలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని మంత్రి శంకర్ నారాయణ పట్టుబట్టారు. ఫైనల్ గా మంత్రి ప్రయత్నాలు ఫలించడం పెనుగొండ సమీపంలోని మడకశిర రోడ్డులో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

59 ఎకరాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి గా, 475 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన సర్కార్

59 ఎకరాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి గా, 475 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన సర్కార్


59 ఎకరాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి గా మెడికల్ కళాశాల నిర్మాణానికి అంగీకరించింది. దాని కోసం 475 కోట్ల రూపాయల నిధులను సైతం విడుదల చేసింది. త్వరలో పెనుగొండ జిల్లా ప్రధాన కేంద్రం కాబోతుందని ,పెనుగొండలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు గల కారణాన్ని మంత్రి శంకర్ నారాయణ సమర్థించారు . ఏది ఏమైనా హిందూపురం నియోజకవర్గంలో ఏర్పాటు కావలసిన మెడికల్ కాలేజీని, పెనుగొండ నియోజకవర్గానికి తరలించి బాలయ్యకు బిగ్ షాక్ ఇచ్చారు. తన నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు అవుతుంది అన్న బాలయ్య ఆశలపై నీళ్లు చల్లారు.

English summary
The AP government has decided to set up a new medical college and a super-specialty hospital near Penukonda in 59 acres and released Rs 475 crores towards the construction of required infrastructure. Hindupur MLA Balakrishna had forwarded a proposal to the YSRCP government asking to establish medical college in Hindupur as the land was already acquired. However, the AP government selected Penukonda for setting up medical college bowing to pressure from Minister for Roads and Buildings M Sankara Narayana. The minister justified the reason for establishing the medical college in Penukonda as it will soon become district headquarters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X