హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

100 శాతం వ్యాక్సినేషన్.. తెలంగాణలో ఇలా, హమ్మయ్యా.. మరీ బూస్టర్ డోస్..?

|
Google Oneindia TeluguNews

ఒమిక్రాన్ దడ దడ లాడిస్తోంది. దీంతో భయాందోళన నెలకొంది. ఇప్పటికే మధ్యప్రదేశ్ రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తోంది. రేపటి నుంచి యూపీ స్టార్ట్ చేయనుంది. అన్నీ రాష్ట్రాలు కూడా తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో ఎంపీ ముందడుగు వేసింది. యూపీ వేయబోతుంది. ఇటు ఒమిక్రాన్‌ నిలువరించడం బూస్టర్ డోసుతో సాధ్యం అని నిపుణులు తెలియజేశారు. ఇదీ కాస్త సానుకూల అంశంగా మారింది.

తెలంగాణ రికార్డు..

తెలంగాణ రికార్డు..

మరోవైపు కరోనా వ్యాక్సినేషన్‌లో తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించింది. ప్రభుత్వం, వైద్యసిబ్బంది కృషితో రాష్ట్రంలో మొదటి డోస్ వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తయ్యింది. తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. దేశంలో కరోనా ఎంట్రీ ఇచ్చిన 9 నెలల తర్వాత వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 337 రోజుల కింద ప్రారంభమైన వ్యాక్సినేషన్.. ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుంది. పల్లె, పట్టణాలు, గుడాలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇవ్వాలనే ఉద్దేశంతో వైద్య సిబ్బంది ఇంటి ఇంటికీ తిరుగుతున్నారు. వైద్యసిబ్బంది కృషితో దేశంలో ఇప్పటికే 130 కోట్ల డోసుల పంపిణి జరిగింది.

వంద శాతం మందికి..

వంద శాతం మందికి..

తెలంగాణ రాష్ట్రంలో 100 శాతం మందికి మొదటి విడత వ్యాక్సినేషన్ పూర్తైంది.. రెండోవిడత కూడా 61 శాతం మంది తీసుకున్నారు. మొదట్లో వ్యాక్సిన్ కోసం కొంత ఇబ్బంది పడినా క్రమంగా ఉత్పత్తి పెంచడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన 50 రోజులకే విరివిగా లభించింది. ఇక ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతుంది. ప్రతి రోజు 50 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. ఉత్పత్తి పెంచడంతో అనుకున్న సమయం కంటే ముందు వ్యాక్సినేషన్ ప్రక్రియ టార్గెట్ రీచ్ అయింది. మరో నెలలో పూర్తిస్థాయి 100 శాతం వ్యాక్సినేషన్ అందించిన రాష్ట్రంగా నిలిచే అవకాశం ఉంది.

ఒమిక్రాన్ దడ

ఒమిక్రాన్ దడ

తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు మొత్తం 38కి చేరాయి. ఇతర దేశాల నుంచి వచ్చిన 12మందిలోనూ ఒమిక్రాన్ గుర్తించారు. రిస్క్ దేశాల నుంచి వచ్చిన మరో ఇద్దరికి ఒమిక్రాన్ సోకినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు నిర్ధారణ అయిన 38 ఒమిక్రాన్ కేసులలో ఆరుగురు మాత్రమే హై రిస్క్ దేశాల నుంచి రాగా, మిగిలినవారు ఒమిక్రాన్ రిస్క్ లేని దేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక కేసు వచ్చిన సంగతి తెలిసిందే. అతని ప్రైమరీ సెకండరీ కాంటాక్టులకు సెకండ్ చేశారు. అతని భార్య, తల్లికి కరోనా సోకింది. దీంతో వారి శాంపిల్స్ కూడా జినొమ్‌కు పంపించారు.

English summary
100 percent first dose vaccination done in telangana state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X