దళిత్ ఎంపవర్‌మెంట్‌కు వెయ్యి కోట్లు: కేసీఆర్, జిమ్మిక్ అని వివేక్ ఫైర్
దళితులు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్ తరాలు నష్టపోతాయని పేర్కొన్నారు. అందుకే దళితుల అభ్యున్నతి కోసం దశలవారీగా కార్యాచరణ చేపడుతున్నట్టు వెల్లడించారు. గ్రామీణ, పట్టణ దళితుల సమస్యలను గుర్తించి పరిష్కారాలను వెతకాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ హైదరాబాద్ ప్రగతి భవన్లో అఖిలపక్ష సమావేశం జరిగింది. సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ కార్యాచరణ విధివిధానాలపై సమావేశంలో చర్చించారు.
బడ్జెట్ లో సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ కు రూ.1000 కోట్లు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. మరో రూ.500 కోట్లు అదనంగా అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. నాలుగేళ్లలో రూ.40 వేల కోట్లు ఖర్చు చేయాలనేది తమ ప్రభుత్వ యోచన అని కేసీఆర్ వివరించారు. రైతుబంధు పథకం, ఆసరా పెన్షన్ల మాదిరిగా దళితుల్లో అర్హులైన కుటుంబాల గణన జరగాలని అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంటే మరోవైపు సీఎం కేసీఆర్ పై మాజీ ఎంపీ వివేక్ ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ దళిత ద్రోహి అని విరుచుకుపడ్డారు. ఆయనకు ఎన్నికల సమయంలోనే దళితులు గుర్తొస్తారని మండిపడ్డారు. హుజూరాబాద్ లో ఉన్న 45 వేల ఓట్ల కోసమే కేసీఆర్ అఖిలపక్షం సమావేశం నిర్వహించారని ఆరోపించారు. అక్రమ మార్గంలో కేటీఆర్‌ను సీఎం చేయాలనుకుంటున్నారని వివేక్ హాట్ కామెంట్స్ చేశారు. కానీ ఆయనకు దళితులు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications