హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో 11.5 కిలోల బంగారం పట్టివేత ..నిత్యకృత్యంగా బంగారం అక్రమ రావాణా

|
Google Oneindia TeluguNews

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భద్రతా ప్రమాణాలు ఎంతగా తీసుకున్నా , అనునిత్యం తనిఖీలు జరుగుతున్నా ఎయిర్ వేస్ మార్గంగా బంగారం తరలించే ప్రయత్నం చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టుకోవటం నిత్య కృత్యమైపోయింది. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఎయిర్ పోర్ట్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ మహిళ నుంచి ఏకంగా 11.5 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో కిలోలకొద్దీ బంగారం పట్టుబడుతోంది. మే 6న సింగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చిన సురేష్ అనే ప్రయాణికుడిపై అనుమానం వచ్చిన అధికారులు చెక్ చేయగా షూలో దాచి పెట్టిన 3.3వందల కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.అలాగే మస్కట్ నుంచి వచ్చిన వ్యక్తి వద్ద 2.75 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నవిషయం తెలిసిందే.

11.5 kg gold seized at Shambhad airport .. The gold smuggling is routine

ఇక తాజాగా 11.5 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. ఇలా లెక్కవేసుకంటు పోతే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పట్టుబడుతున్న బంగారం లెక్క అంతేలేకుండా పోతోంది. గతంలో కూడా ఈ తరహా బంగారం తరలింపుకు ప్రయత్నం చేసి ఎందరో కేసుల పాలయ్యారు. అయినప్పటికీ దుబాయ్ , మస్కట్ తదితర ప్రాంతాల నుండి వచ్చేవారు దొంగ దారిన బంగారం తీసుకురావటం మాత్రం మానటం లేదు.

English summary
The customs officials seized three kilograms gold from a passenger at the Rajiv Gandhi International Airport (RGIA) in Shamshabad . According to officials, the passenger arrived by a flight from Dubai. police seized 11. 5 kgs of gold from the female passenger . By registering a case, officials took up investigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X