కరోనా తగ్గుముఖం.. నిన్నటికంటే తక్కువ.. 12 మంది మృతి

కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 1,114 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్కరోజులో 12 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 16 వేల 462 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా సోకిన మృతిచెందిన వారి సంఖ్య 3 వేల 598 మందికి చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో 129 కరోనా కేసులు వచ్చాయి. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5 లక్షల 96 వేల 628గా ఉంది. గృహ/సంస్థల ఐసోలేషన్ గల వ్యక్తుల సంఖ్య 03 వేల 598గా ఉంది.

ఆదిలాబాద్ జిల్లాలో 02 కరోనా కేసులు.. భద్రాద్రి కొత్తగూడెం 59. జీహెచ్ఎంసీ 129. జగిత్యాల 23. జనగామ 11. జయశంకర్ భూపాలపల్లి 21. జోగులాంబ గద్వాల 07. కామారెడ్డి 03. కరీంనగర్ 69. ఖమ్మం 69. కొమరం భీం ఆసిఫాబాద్ 06. మహబూబ్ నగర్ 23. మహబూబాబాద్ 44. మంచిర్యాల 49. మెదక్ 08. మేడ్చల్ మల్కాజ్ గిరి 58. ములుగు 24. నాగర్ కర్నూలు 12. నల్గొండ 72. నారాయణపేట 06. నిర్మల్ 03. నిజామాబాద్ 08. పెద్దపల్లి 53. రాజన్న సిరిసిల్ల 16. రంగారెడ్డి 75. సంగారెడ్డి 16. సిద్దిపేట 44. సూర్యాపేట 69. వికారాబాద్ 14. వనపర్తి 17. వరంగల్ రూరల్ 16. వరంగల్ అర్బన్ 53. యాదాద్రి భువనగిరి 35 కలిపి మొత్తం 1,114 కేసులు ఉన్నాయి.

last 24 hours 1114 people infect corona in telangana and 12 people died due to virus.

వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది.. కానీ అదీ కూడా తగ్గుముఖం పడుతుందని చెప్పడం కాస్త సానుకూల అంశం. అయితే కొత్తగా డెల్టా వేరియంట్ భయపెడుతుంది.

ఈ నెల 21వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా తీసుకునే అవకాశం ఉంది. నామమాత్ర రుసుం రూ.250 ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. అందరికీ వ్యాక్సిన్ అందజేస్తే కరోనాను జయించడం తేలికే అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+