తెలంగాణలో కొత్తగా 1539 కరోనా కేసులు.. మరో ఐదుగురు మృతి...

తెలంగాణలో కొత్తగా 1536 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో ఐదుగురు కరోనాతో మృతి చెందారు. మరో 555 కరోనా కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గురువారం (నవంబర్ 5) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,42,682కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1362కి చేరింది. ప్రస్తుతం 18,656 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. మరో 15,864 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.గడిచిన 24 గంటల్లో 978 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,25,664కి చేరింది.

 1539 new coronavirus cases and 5 deaths reported from telangana

గడిచిన 24గంటల్లో మొత్తం 44,327 శాంపిల్స్‌ను పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 44,84,183కి చేరింది. ఒక మిలియన్ జనాభాకు సగటున 1,20,477 కరోనా టెస్టులు చేస్తున్నట్లు బులెటిన్‌లో వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.5శాతం ఉండగా... తెలంగాణలో 0.55శాతం ఉన్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 92.2శాతం ఉండగా తెలంగాణలో 91.85శాతం ఉన్నట్లు తెలిపారు.

తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 285 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 123 కేసులు,మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 102 కేసులు నమోదయ్యాయి. జిల్లాల్లో అత్యధికంగా కరీంనగర్‌లో 86,భద్రాద్రి కొత్తగూడెంలో 82,ఖమ్మంలో 78 కేసులు నమోదయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+