వావ్.. పడిపోతున్న కేసులు.. నిన్నటి కన్నా తక్కువగా.. తెలంగాణలో ఇలా..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 1,813 కేసులు వచ్చాయి. 17 మంది కరోనాతో కన్నుమూసినట్టు వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 1,29,896 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. తాజా కేసులతో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 5,96,813కు పెరిగింది.

3426 మృత్యువాత..
ఇప్పటి వరకు మొత్తం 3,426 మంది చనిపోయారు.1,801 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇంకా 24,301 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 180 కేసులు నమోదు కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో 179 కేసులు వెలుగుచూశాయి. ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అత్యల్పంగా ఆరు కేసులు మాత్రమే నమోదయ్యాయి.

ఇంపాక్ట్ ఎక్కువే
ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. సరయిన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు జనానికి ఇబ్బందులు తప్పవు. సో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఫంగస్ ఆందోళన..
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది.. కానీ అదీ కూడా తగ్గుముఖం పడుతుందని చెప్పడం కాస్త సానుకూల అంశం. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.

టీకా కంపల్సరీ..
మరోవైపు ఈ నెల 21వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందజేస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా తీసుకోవచ్చు అని చెప్పారు. కానీ అందుకు నామమాత్ర రుసుం రూ.250 ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. ఇప్పటికీ వ్యాక్సిన్ కొరత ఉంది. కానీ దానిని అధిగమిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అందరికీ వ్యాక్సిన్ అందజేస్తే కరోనాను జయించడం తేలికే అవుతుంది.












Click it and Unblock the Notifications