Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అల్లుడితో అత్త అక్రమ సంబంధం.. షాక్‌తో నవ వధువు ఆత్మహత్య

కన్నతల్లే కుమార్తెను వంచించింది. ప్రియుడిని ఇంట్లోనే తెచ్చి పెట్టుకునేందుకు బిడ్డను బలి పశువును చేసింది. తన ప్రియుడితో ఆమెకు వివాహం జరిపించి.. అనుకున్నట్టుగానే ప్రియుడితో అక్రమ సంబంధం కొనసాగించింది. విషయం కుమార్తెకు తెలిసి తీవ్రంగా కుంగిపోయింది. వేరే చోట కాపురం పెడుదామని భర్తతో చెబితే తల్లి అందుకు ఒప్పుకోలేదు. పైగా చనిపోతానని బ్లాక్‌మెయిల్ చేసింది. దీంతో చేసేది లేక.. ఆ నవ వధువే ఆత్మహత్య చేసుకుంది.

ఎక్కడ జరిగింది.. అసలేం జరిగింది..

ఎక్కడ జరిగింది.. అసలేం జరిగింది..

హైదరాబాద్ మీర్‌పేటలో ఈ దారుణం జరిగింది. తన తల్లికి భర్తతో అక్రమ సంబంధం ఉందన్న విషయం తెలిసి ఓ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మీర్‌పేట అల్మాస్‌గూడకు చెందిన వేలూరి అనితకు బాబూరావు అనే వ్యక్తితో 20 ఏళ్ల క్రితం పెళ్లయింది. అయితే కొన్ని కారణాల వల్ల ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారు. పిల్లలు మాత్రం అనిత దగ్గరే ఉంటున్నారు. పెద్ద కుమార్తె వందన (19) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.

నవీన్‌తో కలిసి ఉండేందుకు..

నవీన్‌తో కలిసి ఉండేందుకు..

బాబూరావుతో విడిపోయాక అనిత క్యాటరింగ్ పనులు చేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు నవీన్ కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతను తరుచూ అనిత ఇంటికి వచ్చి వెళ్తుండేవాడు. ఇద్దరి మధ్య చాన్నాళ్లుగా అలా అక్రమ సంబంధం కొనసాగుతోంది. అయితే నవీన్ శాశ్వతంగా తన ఇంట్లోనే ఉండాలంటే.. తన కుమార్తెను అతనికిచ్చి పెళ్లి చేయాలనుకుంది. అందుకు ఆమెను కూడా ఒప్పించింది. తల్లి మర్మం గురించి తెలియని ఆ అమాయకురాలు పెళ్లికి ఒప్పుకుంది.

Recommended Video

    Amazing Team Work In Vegetable Market | ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే..!! | Oneindia Telugu
    అసలు విషయం తెలిసి ఆత్మహత్య చేసుకున్న వందన.

    అసలు విషయం తెలిసి ఆత్మహత్య చేసుకున్న వందన.

    గతేడాది డిసెంబర్ 1న నవీన్-అనితల వివాహం జరిగింది. వివాహమైన కొద్దిరోజులకే వందనకు అసలు విషయం తెలిసింది. తన భర్తకు,తల్లికి మధ్య వివాహేతర సంబంధం ఉందని తెలుసుకుంది. అప్పటినుంచి వేరు కాపురం పెడుదామని భర్తకు పలుమార్లు చెప్పింది. అయితే ఇంట్లో నుంచి బయటకు వెళ్తే.. తాను చనిపోతానని తల్లి బ్లాక్‌మెయిల్ చేసింది. దీంతో మానసిక వేదనకు గురైన వందన గురువారం రాత్రి ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై మృతురాలి సోదరి సంజన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+