హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోజు మంచినీరు ఎంత తీసుకుంటున్నారు.. వేసవిలో ఎంత, నిపుణులు ఏమంటున్నారు..

|
Google Oneindia TeluguNews

అసలే వేసవి.. ఆపై డీహైడ్రేషన్ అవుతుంది.. అంటే శరీరానికి సరిపడ నీరు తాగకుంటే అంతే సంగతులు. రోజు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. అంటే వేసవి కాబట్టి.. కనీసం 5 లేదంటే 6 లీటర్ల నీరు తాగాలని కోరుతున్నారు. 20 కిలోలకు లీటర్ చొప్పున తీసుకోవాలని కొందరు అంటుంటారు. శరీరానికి తగినంత నీరు అందించాల్సిన అవసరం ఉంది. చాలా మంది శరీరానికి కావల్సినంత నీరు అందించకపోవటం వల్ల అనేక ఆరోగ్య ససమ్యలను కొని తెచ్చకుంటున్నారు.

అవయవాల పనితీరు..

అవయవాల పనితీరు..


తగినంత నీరు అందించాల్సిన అవసరం తప్పకుండా ఉందని నిపుణులు చెబుతున్నారు. శరీర అవయవాల పనితీరు మెరుగుపడాలంటే నీరు తాగటం చాలా అవసరం. శరీరం డీ హైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుకునేందుకు నీరు తాగటం మంచిది. అలాగని ఎక్కువ నీరు తాగడం కూడా చాలా ప్రమాదకరం. శరీరంలోని మూత్రపిండాలు ఒక రోజులో 20 నుండి 28 లీటర్ల నీళ్ళని ఫిల్టర్ చేయగలదు. ఒక గంటలో ఒక లీటర్ కన్న ఎక్కువ ఫిల్టర్ చేయలేవు. మన సెల్స్‌లో సోడియం పొటాషియం ఎలెక్ట్రోలైట్స్ ఉంటాయి. ఎలెక్ట్రోలైట్స్ మనము తాగే నీళ్లలో కూడా ఉంటాయి. వీటిని మన మూత్రపిండాలు ఫిల్టర్ చేస్తూ ఉంటాయి. ఒక లిమిట్ వరకు మాత్రమే ఫిల్టర్ చేస్తాయి.

మరీ ఎక్కువ తీసుకుంటే..

మరీ ఎక్కువ తీసుకుంటే..

నీరు ఎక్కువగా తాగితే ఎలేక్ట్రోలైట్స్ కూడా ఎక్కువగా మన శరీరంలో చేరే అవకాశం ఉంటుంది. మూత్రపిండాలు కూడా వీటిని ఫిల్టర్ చేయలేవు. అప్పుడు ఈ ఎలెక్ట్రోలైట్స్ మన సెల్స్ లో ప్రవేశించి సెల్స్ సైజు పెరుగుతుంది. దీంతో సెల్స్ వాపుకు గురి అవుతాయి. రోజుకు ఎంతనీటిని తాగాలనే ధానిపై చాలా మందిలో అనేక అనుమానాలు ఉన్నాయి. నీటిని ఎక్కువగా ఒకేసారి తాగకుండా కొద్ది కొద్దిగా తాగటం మంచిది. దాహం వేస్తున్న సమయంలో తాగాలి. చెమట ఎక్కువగా పట్టిన సందర్భంలో నీటిని తాగటం మంచిది. దీని వల్ల హైడ్రేట్‌గా ఉండవచ్చు.

మహిళలు, పురుషులు లెక్క ఇలా..

మహిళలు, పురుషులు లెక్క ఇలా..

మహిళలు ప్రతిరోజు 2.7 లీటర్లు, పురుషులు 3.7 లీటర్లు తాగాలని సూచిస్తున్నారు. రోజుకు 8 గ్లాసుల నీళ్లు తాగితే సరిపోతుందని, దాహం వేసినా, వేయకపోయినా.. గంట గంటకు నీళ్లు తాగాలని మరికొందరు నిపుణులు సూచిస్తున్నారు. ప్రెగ్నెంట్ వుమన్స్, బ్రెస్ట్ ఫీడింగ్ వుమన్స్ అయితే.. కనీసం 3 లీటర్ల నీళ్లు తీసుకోవాలని కొన్ని అధ్యయనాల్లో వెల్లడయ్యింది. ఎండాకాలంలో ఎక్కువగా నీటి పరిమాణం ఉండే ఆకుకూరలు, పండ్లను ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. సో ఎక్కువ కాకుండా.. తక్కువ కాకుండా నీరు తీసుకోవడం మంచిది. తక్కువ తీసుకుంటే యూరిన్ ఎల్లో కలర్ వస్తోంది. ఎండకు తిరిగిన ఆ రంగు వస్తోంది. సో నీడపట్టున.. లేదా ఎండకు వెళ్లిన.. తగిన మోతాదులో మంచినీరు తీసుకోవాలి.. ఇదే విషయాన్ని నిపుణులు చెబుతున్నారు.

English summary
summer suggestions:2.7 liter water must take ladies, gents are 3.7 litres experts said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X