హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

21 శాతం స్కూళ్లలో మరుగుదొడ్లు లేవు, ప్రైవేట్ స్కూల్సే బెటర్, ఇదీ డేటా..

|
Google Oneindia TeluguNews

విద్యాలయాల్లో పిల్లలకు టాయ్‌లెట్స్ మస్ట్. విద్యా హక్కు చట్టం కూడా అదే విషయాన్ని చెబుతుంది. కానీ కొన్ని స్కూళ్లలో సరైన వసతులు లేవు. తెలంగాణ రాష్ట్రంలో బాలికలకు టాయిలెట్లు లేవనే విషయం తెలిసింది. ఈశాన్య రాష్ట్రాల కన్నా మెరుగైన స్థాయిలో ఉన్న.. జాతీయ సగటు కన్నా తక్కువే ఉంది. ఇదీ ఆందోళన కలిగిస్తోంది.

21.2 శాతం స్కూళ్లలో మరుగుదొడ్లు లేవు..

21.2 శాతం స్కూళ్లలో మరుగుదొడ్లు లేవు..

తెలంగాణ రాష్ట్రంలో 21.2 శాతం స్కూళ్లలో బాలికలకు సరైన టాయిలెట్స్ లేవు.17.2 శాతం స్కూళ్లలో వాష్ రూం వెళ్లడానికి కూడా అవకాశం లేదు. రాష్ట్రంలో ఐదింటిలో ఒక పాఠశాలలో టాయిలెట్స్ లేవు. దేశంలో ఓ పెద్ద రాష్ట్రంలో ఇలాంటి సమస్య ఉంది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఇలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఈశాన్య రాష్ట్రాల కన్నా మెరుగైన స్థితిలో ఉంది.

78.8 శాతం టాయ్‌లెట్స్

78.8 శాతం టాయ్‌లెట్స్


ప్రభుత్వ, ప్రభుత్వం ఎయిడెడ్, ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్, ఇతర మెనెజ్ మెంట్ స్కూళ్లతో సహా తెలంగాణ రాష్ట్రంలో 78.8 శాతం బాలికలకు మరుగుదొడ్లు ఉన్నాయి. టాయిలెట్స్ లేనిది ప్రభుత్వ పాఠశాలలో అని తేలింది. ప్రైవేట్ స్కూల్స్‌లలో 98.4 శాతంలో 70.6 శాతం టాయిలెట్స్ కలిగి ఉన్నాయి.

రాష్ట్రాలవారీగా..

రాష్ట్రాలవారీగా..


అరుణాచల్ ప్రదేశ్‌లో 68.8 శాతం, మేఘాలయాలో 69.7 శాతం, నాగాలాండ్‌లో 77.1 శాతం, మణిపూర్‌ళో 75.4 శాతం, త్రిపురలో 74.6 శాతం, తెలంగాణలో 78.6 శాతం బాలికలకు మరుగుదొడ్లు ఉన్నాయి. మరుగుదొడ్లకు సంబంధించి జాతీయ సగటు 94.7 శాతం కాగా.. తెలంగాణలో దాని కన్నా తక్కువగా ఉంది. అదే పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో 96.6 శాతంగా ఉంది.

 బాలుర డేటా కూడా..

బాలుర డేటా కూడా..


ఇక తెలంగాణలో బాలికలతోపాటు బాలురకు సంబంధించి డేటా పరిశీలిస్తే 82.8 శాతం ఉంది. అదీ కూడా జాతీయ సగటు 96.5 శాతం కన్నా తక్కువగా ఉంది. హ్యాండ్ వాషింగ్ ఫెసిలిటీస్ కూడా 88.5 శాతంగా ఉంది. అదీ జాతీయ సగటు 93.6 శాతంగా ఉంది. ఈ అంశంపై ఇప్పటివరకు తెలంగాణ విద్యాశాఖ స్పందించలేదు.

English summary
Telangana appears extremely poor in terms of having functional toilets for girls, only slightly better than the Northeastern states but worse than the national average.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X