విభజన అంశాలపై ప్రశ్నిస్తాం.. 23 అంశాలతో బుక్ లెట్: టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో అధికార పక్షం పద్దుతో సిద్దంగా ఉండగా.. విపక్షాలు అస్త్రాలతో సన్నద్దమయ్యింది. సెషన్‌లో తమ సమస్యలపై ఆయా రాజకీయ పార్టీలు ఫోకస్ చేశాయి. టీఆర్ఎస్ ఎంపీలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ సమావేశం అయ్యారు. విభజన అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తుతామని ఎంపీ రంజిత్‌రెడ్డి ప్రకటించారు.

23 అంశాలపై పార్లమెంటరీ పార్టీ మీటింగ్‌లో చర్చించామని రంజిత్ రెడ్డి తెలిపారు. ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్‌ తమకు ఒక బుక్‌లెట్ అందించారని పేర్కొన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులపై ఇప్పటికే కేసీఆర్ కేంద్రానికి లేఖలు రాశారని గుర్తుచేశారు. బడ్జెట్ కూర్పు చూశాక రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం పోరాడుతామని రంజిత్‌రెడ్డి తెలిపారు.

23 issues will discuss in the parliament:trs mp ranjit reddy

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో టీఆర్ఎస్‌ ఎంపీలతో కేసీఆర్ భేటీ అయ్యారు. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై, కేంద్రం నుంచి సాధించాల్సిన పెండింగ్ అంశాలపై కేసీఆర్‌ చర్చించారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన అంశాలపై తెలంగాణ ప్రభుత్వం నివేదిక రూపొందించింది. ప్రభుత్వం రూపొందించిన నివేదికను ఎంపీలకు సీఎం ఇచ్చారు. రాష్ట్ర హక్కులు ప్రయోజనాల కోసం కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. తెలంగాణకు కేంద్రం ఏమీ చేయలేదని కేసీఆర్‌ తప్పుబట్టారు.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపు (సోమవారం) నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను సభలో చదువుతారు. ఆర్థిక సర్వే.. బడ్జెట్‌‌లో ఏయే అంశాలను రూపొందిస్తారో తెలియజేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. బడ్జెట్ ప్రతీరూపమే ఆర్థిక సర్వే.. ఇదే విషయాన్ని విపక్షాలు విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+