నిమ్స్ ఆసుపత్రికి వరుస సెలవులు.. 3 రోజులు నిలిచిపోనున్న OP సేవలు

హైదరాబాద్ : ప్రతినిత్యం వేలాదిగా తరలివచ్చే నిమ్స్ ఆసుపత్రికి వరుస సెలవులు రావడం.. పేద, మధ్య తరగతి ప్రజలను కలవరపెడుతోంది. ఎలాంటి జబ్బులకైనా వైద్యం తీసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నిమ్స్ హాస్పిటల్ కు రోగులు వస్తుంటారు. అలాంటిది వరుసగా 3 రోజులు ఓపీ సేవలు నిలిచిపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది.

ఈ నెల 7వ తేదీ ఆదివారం కావడంతో నిమ్స్ లో ఓపీ సేవలు ఉండవు. అయితే 5, 6 తేదీలను సెలవులుగా ప్రకటించడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చినట్లైంది. 5 నాడు బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి, 6న ఉగాది పండుగ వస్తుండటంతో హాలిడేస్ గా ప్రకటించారు అధికారులు. ఆ క్రమంలో వరుసగా మూడు రోజులు ఓపీ సేవలు ఉండవని తెలిపారు. సోమవారం నుంచి మళ్లీ యథావిధిగా సేవలందిస్తామని తెలిపారు నిమ్స్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మిభాస్కర్.

3 days Continuous holidays for nims hospital no OP services
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+