సిటీలో భారీగా డ్రగ్స్.. 3 కిలోలు స్వాధీనం.. కదిలిన డొంక
విశ్వనగరి భాగ్యనగరంలో డెవలప్ అవుతోంది. ఐటీ, ఇతర రంగాల్లో ఆశించిన దాని కన్నా ఎక్కువే ఉంది. అయితే అభివృద్ధి మాటున డ్రగ్స్ కూడా వచ్చి పడుతున్నాయి. ఇదీ మాత్రం కాస్త ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా డ్రగ్స్ గురించి వచ్చిన వార్తలు దుమారం రేపాయి. ఇప్పుడు తెలంగాణలో డ్రగ్స్ , గంజాయి అక్రమ రవాణా అంశం కుదిపేస్తోంది. రోజూ డ్రగ్స్ , నిషేధిత మత్తు పదార్థా సరఫరాకు సంబంధించిన అంశం బయటకు వస్తూనే ఉంది.

ఇంతలోనే..
ఏపీలో ఇప్పటికే రాజకీయ పార్టీల విమర్శలు పీక్‌కి చేరాయి. తెలంగాణలో ఆ రాష్ట్ర సీఎం ఇప్పటికే డ్రగ్స్ పై రివ్యూ చేసి పోలీసులను హై అలర్ట్ చేశారు. ఈ లోపే హైదరాబాద్‌లో డ్రగ్స్‌కు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ కలకలం రేపుతోంది. హైదరాబాద్ లో 3 కిలోల డ్రగ్స్‌ను నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఓ కొరియర్ సంస్థ ఆఫీస్ లో 3 కిలోల డ్రగ్స్ పార్సిల్‌ను పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారంతో కొరియర్ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు.

3 కిలోల డ్రగ్స్
హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు చేసిన పార్సిల్ లో 3 కిలోల డ్రగ్స్ లభించాయి. చెన్నైకి చెందిన వ్యక్తి ఈ పార్సిల్‌ను ఆస్ట్రేలియాకు పంపించాలని ప్లాన్ వేసినట్టు గుర్తించారు. కొరియర్ ఆఫీస్‌లో ఇచ్చిన డీటెయిల్స్‌తో కూపీ లాగిన ఎన్సీబీ అధికారులు.. చెన్నైకి వెళ్లి వెతికారు. ఇచ్చిన అడ్రస్‌లో ఆ వ్యక్తి దొరకలేదు. ఫేక్ ఐడీ కార్డు ఇచ్చినట్టు తెలుసుకున్నారు. రెండు రోజులపాటు చెన్నైలో మకాం వేసి పార్సిల్ ఇచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేశారు.

తీగ లాగితే
చెన్నైలో అరెస్ట్ అయిన వ్యక్తి ఇచ్చిన డేటా ఆధారంగా వైజాగ్ లో ఒకరిని, హైదరాబాద్‌లో మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన ముగ్గురు బీహరీలని ఎన్సీబీ అధికారులు గుర్తించారు. తమిళనాడు, బీహర్ రాష్ట్రాలకు చెందిన డ్రగ్ సప్లయర్స్ తెలుగు రాష్ట్రాల్లోని నగరాలే కేంద్రంగా ఆస్ట్రేలియా సహా విదేశాలకు డ్రగ్స్ అక్రమంగా సరఫరా చేస్తున్నట్టు అధికారులు సమాచారం సేకరించారు. ఎన్సీబీ అధికారుల సమాచారంతో పోలీసులు నిఘాను మరింత పటిష్టం చేసినట్టు తెలుస్తోంది. కానీ సిటీలో మాత్రం డ్రగ్స్ సరఫరా కాస్త ఆందోళన కలిగిస్తోంది.












Click it and Unblock the Notifications