ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి భద్రత పెంపు: 4+4 సిబ్బంది, బుల్లెట్ ప్రూఫ్ వాహనం
ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఆయనకు భద్రతను పెంచింది. జీవన్ రెడ్డికి బుల్లెట్ ప్రూప్ కారుతోపాటు 4+4 సిబ్బందితో భద్రత కల్పించింది. జీవన్ రెడ్డి హత్య కుట్ర వ్యవహారం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

మరో ముగ్గురు అరెస్ట్..
హత్యా ప్రయత్నం చేసిన నిందితుడు ప్రసాద్‌కు సహకరించిన సంతోష్, సుగుణ, సురేందర్, సాగర్‌ను అరెస్ట్ చేశామని హైదరాబాద్ వెస్ట్ జోన్ డీసీపీ జోయల్ డేవిస్ తెలిపారు. నిందితుడిని విచారించి కీలక వివరాలను సేకరించామని, నాంపల్లిలో ఎయిర్ పిస్టల్, మహారాష్ట్ర నాందేడ్‌లో కత్తి , బీహార్‌లో నాటు తుపాకీ కొనుగోలు చేశామని డీసీపీ వెల్లడించారు. ప్రసాద్‌ను కస్టడీకి తీసుకుని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని అంటున్నారు.

సర్పంచ్ సస్పెన్షన్
నిజామాబాద్ జిల్లా కల్లాడి గ్రామానికి చెందిన పెద్దగాని ప్రసాద్ గౌడ్ టీఆర్ఎస్ నేత.. అతని భార్య లావణ్య కల్లాడి సర్పంచ్‌గా పని చేస్తున్నారు. గ్రామ అభివృద్ధి పనులు అన్ని ప్రసాద్ చూసుకుంటాడు. 20 లక్షలు తన సొంతానికి వాడుకోవడంతో 2022 ఫిబ్రవరిలో కలెక్టర్ అతని భార్యను సస్పెండ్ చేసింది. తన భార్య సస్పెండ్ కావడానికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కారణమని అతనిపై కక్ష పెంచుకొని హత్యాయత్నం చేశాడు.

మహారాష్ట్రలో కత్తి కొనుగోలు
మహారాష్ట్రలో కత్తిని కొనుగోలు చేశాడు. సంతోష్ సహకారంతో ముస్తఫా ఆర్మ్స్ నాంపల్లి వద్ద ఎయిర్ పిస్టల్ కొనుగోలు చేశాడు. నిజామాబాద్‌కు చెందిన సుగుణ, సురేందర్ సహకారంతో బీహార్‌కు చెందిన మున్నా కుమార్ వద్ద రూ.60 వేలకు కంట్రీ మెడ్ పిస్టల్ కొనుగోలు చేశాడు. సాగర్ సహకారంతో బీహార్ ముజాఫర్ లో బుల్లెట్లు కొన్నాడు.

1వ తేదీన ఘటన
ఆగస్టు 1న సాయంత్రం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో గల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటికి ప్రసాద్ చేరుకున్నాడు. ఎమ్మెల్యే మూడో ఫ్లోర్‌లో ఉన్నాడని అతడి పని మనిషి గంగాధర్ చెప్పడంతో అతని వద్దకు వెళ్లి ఎయిర్ పిస్టల్ కత్తి బయటకు తీశాడు. ఇది గమనించి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గట్టిగా అరవడంతో ఎమ్మెల్యే సిబ్బంది అప్రమత్తం కావడంతో అక్కడి నుంచి పారిపోయాడు.












Click it and Unblock the Notifications