మార్కెట్లో మరో 50:50 బిస్కట్ వస్తుందా... ? మహా సంక్షోభంపై అసదుద్దిన్ సెటైర్లు
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై శివసేన, బీజేపీల వైఖరితో ప్రభుత్వ ఏర్పాటుకు జాప్యం జరుగుతున్న తీరుపై ఎంపీ ,ఎమ్ఐఎం అధినేత అసదుద్దిన్ తీవ్రంగా విమర్శించారు. చిన్నపిల్లలు తినే 50:50 బిస్కట్ వలే మరో 50:50 బిస్కట్ ఏమైనా మార్కెట్‌లోకి వస్తుందా అంటూ ఎద్దెవా చేశారు.
అధికారం కోసం రెండు పార్టీలు ఫిఫ్టి ఫిప్టి డ్రామా అడుతున్నారని దుయ్యబట్టారు. అధికార దాహంతో రెండు పార్టీలు రాష్ట్రంలో నెలకొన్న భారీ వర్షాలను కూడ పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఇటివల సతారా జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల రైతులు బాగా దెబ్బతిన్నారని, అయినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

ఇక మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వస్తున్న తరుణంలో రెండు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న ఎమ్ఐఎమ్ బీజేపీతో పాటు శివసేనకు మద్దతు ఇవ్వబోదని స్పష్టం చేశారు. ఇక శివసేనకు సీఎం సీటును దక్కించుకోవడం కోసం ఏం చేయాలో అర్థం కావడం లేదని, ఆపార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రేకు ప్రధాని మోడీ భయం పట్టుకుందని అసదుద్దిన్ అన్నారు.
గత పది రోజులుగా మహారాష్ట్రలో సీఎం పదవిని పంచుకోవాలన్న శివసేన డిమాండ్‌తో ప్రభుత్వ ఏర్పాటుకు సందిగ్థత ఏర్పడిన నేపథ్యంలోనే ఎవరు సీఎం సీటును సాధిస్తారో అనే ఉత్కంఠకు మరో రెండు మూడు రోజుల్లో బ్రేక్ పడనుంది. ఈనెల ఏడులోపు ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే ఎనిమిదవ తేదిన రాజ్యంగ సంక్షోభం ఏర్పాడే అవకాశం ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్న నేపథ్యంలోనే అధిక స్థానాలు ఉన్న బీజేపీ ముఖ్యమంత్రిగా అయిదవ తేదిన ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications