ఖైరతాబాద్ గణేశుడు ఈసారి మట్టి వినాయకుడే.. 50 అడుగుల ఎత్తు.. వర్షం పడిన నో టెన్షన్..
ఖైరతాబాద్ వినాయకుడు అంటే దేశంలోనే క్రేజ్.. అత్యధిక హైట్ ఉండటమే కాదు.. నవరాత్రులు పూజలు వైభవంగా జరుగుతాయి. తాపేశ్వరం నుంచి లడ్డూ కూడా తీసుకొస్తారు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు శుక్రవారం తొలిపూజ నిర్వహించారు. నిర్మల్ ఏకాదశిని పురస్కరించుకుని మండపం వద్ద సాయంత్రం కర్ర పూజ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గతానికి భిన్నంగా ఈ ఏడాది మట్టి వినాయకుడిని ఏర్పాటు చేస్తామని ఉత్సవ కమిటీ తెలిపింది.

మట్టి విగ్రహాలే..
గతేడాది ఉత్సవాల సమయంలో మట్టి విగ్రహాలనే వాడాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. విగ్రహం ఎత్తును 50 అడుగులుగా నిర్ణయించారు. పీవోసీ విగ్రహాలపై ఆంక్షలతో గణేశ్ విగ్రహ ఎత్తును ఉత్సవ కుదించినట్లు ఉత్సవ కమిటీ పేర్కొంది. మట్టి మహాగణపతి నిమజ్జనం ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయవచ్చని, ఆ సమయంలో నిరాటంకంగా 4 గంటల పాటు వర్షం వచ్చినా ఎలాంటి సమస్య ఉండదని శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ తెలిపారు.
ప్రశాంతంగా..
వినాయక చవితి ఉత్సవాలు సాఫీగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగవంత్ రావు కోరారు. ఖైరతాబాద్‌లో గణనాథుడు భారీ ఆకారంలో ఏటా దర్శనమిస్తాడు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసే ఆ విగ్రహం తయారీకి కొన్ని నెలల సమయం పడుతుంది. దాదాపు ఆరు నెలల నుంచే కసరత్తు ప్రారంభిస్తారు.

అప్పుడే క్లారిటీ
ఖైరతాబాద్‌లో గతానికి భిన్నంగా ఈ ఏడాది మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. కమిటీ కన్వీనర్ సందీప్, ఉపాధ్యక్షుడు మహేష్ యాదవ్, తదితరులు ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే మట్టి విగ్రహ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ నెల 24న హైకోర్టులో వినాయక విగ్రహాల తయారీపై వాదనలు ఉన్నాయని.. ఆ రోజు వచ్చే తీర్పును బట్టి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications