డేంజర్ బెల్స్: మూడింతలు పెరిగిన క్యాన్సర్ రోగులు, ఇదీ లెక్క

అసలే కరోనాతో మింగలేక కక్కలేని పరిస్థితి. దానికి తోడు వైరల్ ఫీవర్స్, డెంగ్యూ ఉండనే ఉన్నాయి. ఇవీకాక క్యాన్సర్ రక్కసీ కూడా విరుచుకుపడుతోంది.
తెలంగాణ రాష్ట్రంపై క్యాన్సర్‌ పంజా విసురుతోంది. ఏటా బాధితుల సంఖ్య పెరుగడమే ఇందుకు నిదర్శన. గత 30 ఏళ్లలో 50 శాతం క్యాన్సర్ కేసులు పెరిగాయని నిపుణులు హెచ్చరించారు. పట్టణ జనాభాలో రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తులు, గర్భాశయం,అన్నవాహిక క్యాన్సర్లు పెరుగుతున్నాయని నిపుణులు వివరించారు.

మూడింతలు

మూడింతలు


1990లో ఉమ్మడి రాష్ట్రంలో లక్షమంది జనాభాకు 54 క్యాన్సర్ రోగులు ఉండగా.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి లక్ష జనాభాకు 75 మంది క్యాన్సర్ రోగులు ఉన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2025 నాటికి 12 శాతం మేర కేసులు పెరిగే ప్రమాదం ఉందని ఐసీఎంఆర్, ఎన్‌సీడీఐఆర్‌ ఆందోళన వ్యక్తం చేశాయి.. రాష్ట్రంలో క్యాన్సర్‌ పరిస్థితిపై ఐసీఎంఆర్‌, ఎన్‌సీడీఐఆర్‌ విడుదల చేసిన నివేదికలో ఈ వాస్తవాలు వెలుగుచూశాయి. పట్టణ జనాభాలో రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తులు, నోరు, అన్నవాహిక, గర్భాశయ క్యాన్సర్ పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

ఆందోళన..

ఆందోళన..

అపోలో హాస్పిటల్‌లో అధునాతన క్యాన్స్ర్ చికిత్స కోసం ట్రూబీమ్ రేడియోథెరపీ వ్యవస్థ ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాల్లో లక్షకు 75 కేసులు పెరిగాయంటే ఆందోళన కలిగించే విషయమన్నారు. 2020లో దేశంలో 13.25 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదు కాగా వారిలో 8.5 లక్షలమంది మరణించారని తెలిపారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్స్ అండ్ రీసెర్చ్ బెంగుళూరు ఇటీవల భారతదేశ క్యాన్సర్ కేసులలో గణనీయమైన పెరుగుదలను సూచించాయి. వచ్చే ఐదేళ్లలో ఇది 12 శాతం పెరుగుతుందని అంచనా వేసింది.

ఇలా స్టడీ

ఇలా స్టడీ

'ప్రొఫైల్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ అండ్‌ రిలేటెడ్‌ ఫ్యాక్టర్స్‌-తెలంగాణ' పేరుతో ఐసీఎంఆర్, ఎన్‌సీడీఐఆర్‌ అధ్యయనం చేసింది. రాష్ట్రంలో గతేడాది 47,620 క్యాన్సర్‌ కేసులు వచ్చాయి. బాధితుల్లో 0-19 మధ్య వయసువారే అధికంగా ఉంటున్నారు. నాలుగేళ్లలో ఆ సంఖ్య 53,565కు చేరుతుంది. ఏడాదికి సగటున 3,865 కేసులు నమోదు అవుతున్నాయి. పురుషుల్లో 42.2 శాతం, మహిళల్లో 13.5 శాతం మందికి పొగాకు వల్ల క్యాన్సర్‌ వస్తోంది. మొత్తం బాధితుల్లో 55 శాతం మంది పొగాకు వల్ల క్యాన్సర్‌ బారినపడుతున్నారు. పురుషుల్లో ఎక్కువగా నోటి క్యాన్సర్ (13.3 శాతం), ఊపిరితిత్తుల క్యాన్సర్ (10.9 శాతం), నాలుక క్యాన్సర్0 (7.9 శాతం) వస్తున్నాయి. మహిళలు రొమ్ము (35.5 శాతం), గర్భాశయ ముఖద్వార (8.7 శాతం), అండాశయ (6. 9 శాతం) క్యాన్సర్‌ బారినపడుతున్నారు.

Recommended Video

    Germany: Pilots Return To Work To Cover Tourism Demand
    ఇదీ లెక్క

    ఇదీ లెక్క

    నిమ్స్‌ ఆసుపత్రిలో 2014లో ఏర్పాటు చేసిన పాపులేషన్‌ బేస్డ్‌ క్యాన్సర్‌ రిజిస్ర్టీ కేసులను నమోదు చేస్తున్నారు. దీని పరిధిలో నిమ్స్‌, బసవతారకం ఇండో అమెరికన్‌, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రులు ఉన్నాయి.ఈ రిజిస్ట్రీ సమాచారం ఆధారంగా ఐసీఎంఆర్‌, ఎన్‌సీడీఐఆర్‌ ఈ నివేదికను రూపొందించి విడుదల చేశాయి. 74 ఏళ్లలోపు ఎప్పుడైనా కాన్సర్‌ వచ్చే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. పొగాకును నియంత్రిస్తే ఈ మహమ్మారిని కొంత మేరకు తగ్గించడానికి అవకాశముందని సూచించింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+