తెలంగాణలో కరోనా కలవరం.. మళ్లీ పెరుగుతున్న కేసులు

కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా పెరుగుతూ.. తగ్గుతున్నాయి. తెలంగాణలో కూడా అలానే ఉంది పరిస్థితి.. కానీ ఫోర్త్ వేవ్‌లో సీరియస్ నెస్ లేదు. హాస్పిటాలిటీ కూడా అంతగా లేదు. కానీ కేసులు మాత్రం అప్పుడప్పుడు పెరుగుతున్నాయి. కరోనా కేసులకు సంబంధించి తెలంగాణ వైద్యారోగ్య శాఖ కీలక సూచన చేసింది. ఇప్పుడు వైరల్ ఫీవర్, టైఫాయిడ్, మలేరియా వస్తాయని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 25,585 శాంపిల్స్ పరీక్షించారు. వీరిలో 540 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మరో 603 మంది ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. అత్యధికంగా హైదరాబాద్‌లో 272 కొత్త కేసులు వచ్చాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 26, రంగారెడ్డి జిల్లాలో 21, ఖమ్మం జిల్లాలో 15, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 14 కేసులు వెల్లడయ్యాయి. 708 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో తాజాగా మరణాలేవీ సంభవించలేదు. ఇదీ కాస్త ఊరట కలిగించే అంశం.

540 people are infected coronavirus at telangana

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 8,10,318 మంది కరోనా బారినపడగా, వారిలో 8,01,726 మంది ఆరోగ్యవంతులు అయ్యారు. ఇంకా 4,481 మంది చికిత్స తీసుకుంటున్నారు. కరోనా వైరస్‌తో ఇప్పటివరకు 4,111 మంది మరణించారు. కరోనా వైరస్, మంకీ వైరస్.. కాగా ఇప్పుడు కొత్త వైరస్ కలవర పెడుతుంది. మార్బర్గ్ అనే వైరస్ ఆఫ్రికా ఘనా దేశంలో వెలుగుచూసింది. ఆ వైరస్ సోకి ఇప్పటికే ఇద్దరు చనిపోయారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్నీ దేశాలను అలర్ట్ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+