తెలంగాణలో కరోనా తగ్గుముఖం: 623 కేసులు.. ముగ్గురి మృతి
కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఏపీలో హెచ్చు తగ్గులు ఉండగా.. తెలంగాణలో మాత్రం తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 1,12,796 మందికి పరీక్షలు చేశారు. కొత్తగా 623 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,47,229కి చేరింది. కరోనాతో ముగ్గురు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య 3814కి చేరింది. 594 మంది బాధితులు చికిత్స నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 8803 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో 77 కేసులు వచ్చాయి.
వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది.












Click it and Unblock the Notifications