భారీగా పెరిగిన కేసులు.. 600 పైచిలుకు మందికి పాజిటివ్
ఫోర్త్ వేవ్‌లో కరోనా అంత సీరియస్ ఏం అవడం లేదు. జనరల్ వైరస్‌లా మారింది. అయితే కేసులు మాత్రం పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో తెలంగాణలో 30,552 కరోనా పరీక్షలు నిర్వహించారు. వారిలో 658 మందికి పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్‌లో అత్యధికంగా 316 కొత్త కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 52, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 41, ఖమ్మం జిల్లాలో 30, పెద్దపల్లి జిల్లాలో 25, నల్గొండ జిల్లాలో 21 కేసులు వెల్లడయ్యాయి.

628 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ నమోదుకాలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో 4,111 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,10,976 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,02,354 మంది కోలుకున్నారు. ఇంకా 4,511 మంది చికిత్స పొందుతున్నారు.
కరోనా వైరస్, మంకీ వైరస్.. కాగా ఇప్పుడు కొత్త వైరస్ కలవర పెడుతుంది. మార్బర్గ్ అనే వైరస్ ఆఫ్రికా ఘనా దేశంలో వెలుగుచూసింది. ఆ వైరస్ సోకి ఇప్పటికే ఇద్దరు చనిపోయారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్నీ దేశాలను అలర్ట్ చేసింది. ఇప్పుడు అంతా సజావుగా ఉంది అనుకునే లోపు కొత్త వైరస్.. వేరియంట్లు వస్తున్నాయి. జనాలను ఎప్పుడూ ఏదో ఒక భయం పెడుతూనే ఉన్నాయి.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications