తెలంగాణలో భారీగా తగ్గుముఖం: 710 కేసులు.. నలుగురు మృతి
కరోనా కేసులు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో లక్ష 10 వేల 355 మందికి పరీక్షలు చేశారు. వీరిలో కొత్తగా 710 మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసులు 6 లక్షల 34 వేల 605కి చేరాయి.
గత 24 గంటల్లో కరోనా సోకిన నలుగురు చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 3747కి చేరింది. ఒక్కరోజులో 808 మంది కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 6 లక్షల 20 వేల 757కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10 వేల 101 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.