తెలంగాణలో కరోనా కల్లోలం.. మళ్లీ పెరుగుతున్న కేసులు..
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ కూడా 700 పైచిలుకు కేసులు వచ్చాయి. గత 24 గంటల్లో 32,808 శాంపిల్స్ పరీక్షించారు. వీరిలో 739 మందికి పాజిటివ్ వచ్చింది. అత్యధికంగా హైదరాబాద్‌లో 377 కొత్త కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 60, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 53, మంచిర్యాల జిల్లాలో 26, ఖమ్మం జిల్లాలో 24, పెద్దపల్లి జిల్లాలో 24 కేసులు గుర్తించారు.

662 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు 8,13,120 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,04,323 మంది ఆరోగ్యవంతులు అయ్యారు. ఇంకా 4,686 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,111 మంది కరోనాతో మృతి చెందారు.
కరోనా వైరస్, మంకీ వైరస్.. కాగా ఇప్పుడు కొత్త వైరస్ కలవర పెడుతుంది. మార్బర్గ్ అనే వైరస్ ఆఫ్రికా ఘనా దేశంలో వెలుగుచూసింది. ఆ వైరస్ సోకి ఇప్పటికే ఇద్దరు చనిపోయారు. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్నీ దేశాలను అలర్ట్ చేసింది. ఇప్పుడు అంతా సజావుగా ఉంది అనుకునే లోపు కొత్త వైరస్.. వేరియంట్లు వస్తున్నాయి. జనాలను ఎప్పుడూ ఏదో ఒక భయం పెడుతూనే ఉన్నాయి. ఇప్పుడు కరోనా కేసులు కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సీరియస్ నెస్ ఎక్కువగా లేకున్నా.. టెన్షన్ మాత్రం తప్పడం లేదు. ఈ సారి వర్షకాలంలో.. సీజనల్ వ్యాధులతోపాటు కేసులు కూడా టెన్షన్ పెట్టిస్తున్నాయి.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications