తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా: 772 కేసులు.. ఏడుగురు మృతి

కరోనా కేసులు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 772 పాజిటివ్ కేసులు వచ్చాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 88 కేసులు నమోదు కాగా, ఆ తర్వాతి స్థానంలో 56 కేసులతో ఖమ్మం జిల్లా నిలిచింది. జోగులాంబ గద్వాల్ జిల్లాలో కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదయ్యింది.

కరోనా బారిన పడ్డ ఏడుగురు చనిపోయారు. దీంతో కరోనా సోకి చనిపోయిన వారి సంఖ్య 3,710 మందికి చేరింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 6,29,054కి చేరింది. 6,13,872 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 11,472 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న రాష్ట్రంలో 784 కరోనా పాజిటివ్ కేసులు వచ్చిన సంగతి తెలిసిందే. క్రమంగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.

772 people infected corona in telangana

Recommended Video

    Importance Of Jeepneys In The Philippines, జీప్ డ్రైవర్ లైఫ్ ఇదీ || Oneindia Telugu

    వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

    వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+