Hyderabad: ప్రగతినగర్‍లో ఘోరం.. మ్యాన్ హోల్‍లో పడి కొట్టుకుపోయిన బాలుడు..
హైదరాబాద్ లోని ప్రగతినగర్ లో దారుణం జరిగింది. ప్రగతినగర్ NRI కాలనీలో ఓ బాలుడు మ్యాన్ హోల్ పడి కొట్టుకుపోయాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడు మ్యాన్ హోల్ లో పడి కొట్టుకుపోయినట్లు తెలిసింది. మొదట బాలుడి కోసం తల్లిదండ్రులు వెతికారు ఎక్కడా కనిపించకపోయేసారికి సీసీ కెమెరాలు పరిశీలించారు. సీసీ కెమెరాల్లో బాలుడు మ్యాన్ హోల్ పడినట్లు తెలిసింది. ఇంటి ముందున్న మ్యాన్ హోల్ లో పడినట్లు గుర్తించారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఉదయం 11 గంటల 30 నిమిషాలకు బాలుడు మ్యాన్ హోల్ పడినట్లు సీసీ కెమెరా దృశ్యాలను బట్టి అర్థమవుతుంది. బాలుడు పడిన మ్యాన్ హోల్ నేరుగా ప్రగతినగర్ లోని తుర్క చెరువులోకి వెళ్తుంది. నీటి ఉధృతికి బాలుడు చెరువులోకి వెళ్లిపోయి ఉంటాడని జీహెచ్ఎంసీ అధికారులు భావిస్తున్నారు. బాలుడి కోసం పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే బాలుడు మ్యాన్ హోల్ లో పడిపోయిన ఘటనా స్థలం నుంచి కిలో మీటర్ దూరంలో ఉన్న రాజీవ్ గృహకల్ప దగ్గర బాలుడి డెడ్ బాడీ కనిపించింది.

ఈ విషయాన్ని వెంటనే స్థానికులు బాచుపల్లి పోలీసులకు చెప్పారు. దీంతో రాజీవ్ గృహకల్ప దగ్గర ఉన్న సాయి నగర్ చెరువులో గాలింపు చేపట్టారు. గజ ఈతగాళ్లతో బాలుడి కోసం గాలిస్తున్నారు. తమ కొడుకు కోసం తల్లితండ్రులు తీవ్రంగా రోదిస్తున్నారు. అప్పటి వరకు తమతో కలిసి ఉన్న బాలుడు మ్యాన్ హోల్ లో పడి కొట్టుకపోవడంతో గండెలు పగిలేలా ఎడుస్తున్నారు. అయితే మ్యాన్ హోల్ పడి చనిపోవడం గతంలో కూడా జరిగింది. మ్యాన్ హోళ్లు తెరవడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే ఎంత మంది మ్యాన్ హోల్ పడి చనిపోయినా అధికారుల తీరు మారడం లేదు. ఎక్కడికక్కడ మ్యాన్ హోళ్లు తెరిచి ఉండడంతో ప్రజలు ప్రమాదా బారిన పడి చనిపోతున్నారు.
గత ఏప్రిల్ లో ఇలానే ఓ బాలిక మ్యాన్ హోల్ పడి చనిపోయింది. సికింద్రాబాద్ లోని కళాసిగూడలో మౌనిక అనే చిన్నారి తన అన్నతో కలిసి పాల ప్యాకెట్ కోసమని బయటకు వచ్చి మ్యాన్ హోల్ పడిపోయింది.అప్పట్లోనే జీహెచ్ఎంసీ తీవ్రంగా విమర్శలు వచ్చాయి. తాజాగ మరో బాలుడు కూడా మ్యాన్ హోల్ పడి చనిపోవడంతో జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం ప్రజలు అగ్రహం వ్యక్తం చస్తున్నారు.












Click it and Unblock the Notifications