Hyderabad: కూకట్‍పల్లిలో కారు బీభత్సం.. పల్టీలు కొట్టిన కారు..
కూకట్‍పల్లిలో కారు బీభత్సం సృష్టించింది.
ట్రాఫికి నిబంధనలపై ఎంత అవగాహన కల్పించిన కొంత మంది వాహనదారుల తీరు మారడం లేదు. అతి వేగం, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ ధరించకపోవడంతో ప్రాణాలు పోతున్నాయి. ముఖ్యంగా అతివేగం ప్రాణాలు తీస్తోంది నిత్యం ఎక్కడో ఓ చోట అతివేగం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ కూకట్ పల్లిలో ఓ కారు బీభత్సం సృష్టించింది.

అతివేగమే కారణం
కారు డివైడర్ ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. వేగంగా వచ్చిన కారు టైరు ఒక్కసారిగా పేలిపోవడంతో అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టిది. అయితే కారులోని ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అయితే ఈ ఘటన జరిగిన ప్రాంతంలో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.

డీసీఎంను ఢీకొన్ని షిఫ్ట్
ఈ కారు ప్రమాదంతో చుట్టు పక్కాల ఒక్కసారిగా షాక్ అయ్యారు. కాగా గాయాల పాలైన డ్రైవర్ పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. మరో రోడ్డు ప్రమాదం రంగారెడ్డి జిల్లాలో జరిగింది. డీసీఎం వాహనాన్ని షిఫ్ట్ కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మహేశ్వరం మండలం తుమ్మలూరు గేట్ సమీపంలో ఈ ఘటన జరిగింది.

వెల్దండ
మృతులను రామస్వామి, యాదయ్య, కేశవులు, శ్రీనుగా గుర్తించారు. మృతులంతా నాగర్ కర్నూల్ జిల్లాలోని వెల్దండ మండలం పోతేపల్లి గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. వెల్దండ నుంచి హైదరాబాద్ వెళుతున్న షిఫ్ట్ కారు మాక్ ప్రాజెక్ట్ సమీపంలోకి రాగానే.. హైదరాబాద్ నుంచి కలకొండపల్లి వెళ్తున్న డీసీఎం వ్యాను ఎదురుగా వస్తున్న వాహానాన్ని ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఉస్మానియా ఆస్పత్రి
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ ఫంక్షన్‌లో వంట చేసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

విశాఖపట్నంలో
అటు విశాఖపట్నం జిల్లాలో కూడా రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకోజి పాలెం జంక్షన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారు. మద్దిలపాలెం వైపు వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ట్రాలర్ టెంపొ ఢీ కొట్టింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు సాయి, దుర్గ ప్రసాద్, గోపిగా పోలీసులు గుర్తించారు. ఈ మూడు ప్రమాదాలకు అతివేగమే కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు.












Click it and Unblock the Notifications