హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉస్మానియా ఆసుపత్రి ఐసీయూలో స్వేచ్ఛగా.. యథేచ్ఛగా చక్కర్లు కొడుతోన్న పిల్లి: హెచ్ఆర్సీ సీరియస్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కరోనా కల్లోలాన్ని సృష్టిస్తోన్న వేళ.. వందలాది మంది దీని బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతోన్న సమయంలో.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న డొల్లతనాన్ని బయటపెట్టేలా చేసింది ఓ పిల్లి. ఘనత వహించిన ఉస్మానియా ప్రభుత్వ ఆసుపత్రిలో స్వేచ్ఛగా.. యథేచ్ఛగా చక్కర్లు కొట్టింది.. అదీ ఐసీయూ వార్డలో. అత్యవసర వైద్య చికిత్సను అందించే వార్డులో ఓ పిల్లి తిరుగాడటానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఐసీయూ వార్డులో పిల్లి తిరుగాడటం పట్ల పేషెంట్ల బంధువులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును నమోదు చేసుకున్న కమిషన్.. ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు నోటీసులను పంపినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. కరోనా వైరస్ బారిన పడి వందలాది మంది పేషెంట్లు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడాన్ని మానవ హక్కుల కమిషన్ అధికారులు తీవ్రంగా పరిగణించినట్లు చెబుతున్నారు.

A cat is seen roaming around ICU ward in Osmania General Hospital at Hyderabad

ఐసీయూలో దూరిన ఓ పిల్లి పేషెంట్ల మీదుగా అటు, ఇటు తిరుగాడటం, ఒక బెడ్ మీది నుంచి మరో బెడ్ మీదికి దూకుతుండటం, పేషెంట్లకు సంబంధించిన ఆహారాన్ని తినడానికి ప్రయత్నించడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ వీడియోను ఆధారంగా చేసుకుని పేషెంట్ బంధువు ఒకరు మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారని, ఉస్మానియా ఆసుపత్రిలో అధ్వాన్న పరిస్థితులు నెలకొన్నాయనే విషయాన్ని ఆయన ఇందులో పొందుపరిచారని తెలుస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో రోగికి ప్రాణాన్ని నిలపడానికి వినియోగించే ఐసీయూలోనే ఈ పరిస్థితి నెలకొనడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారని అంటున్నారు.

ఈ ఘటనపై తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. దీనిపై పూర్తి వివరాలను తెలుసుకోవాలని ఆయన తన శాఖ అధికారులను ఆదేశించారని తెలుస్తోంది. ఇలాంటి వాతావరణం మధ్య వైద్యాన్ని అందించడం పట్ల పేషెంట్ల, వారి బంధువులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అపరిశుభ్ర ప్రదేశాల్లో కరోనా వైరస్ మరింత విజృంభించడినిక అవకాశం ఉందని, ఆసుపత్రుల్లాంటి చోట్ల మరింత సులువుగా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం లేకపోలేదని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.

Recommended Video

COVID-19 Lockdown: Watch Pregnant Woman Walks For 7km, Delivers At Dental Clinic

English summary
Complaint filed after a cat is seen roaming around ICU ward in Osmania General Hospital at Hyderabad. Patients alleged that Medical staff is least bothered. Telangana Human Rights Commission seeks report from the Hospital superintendent. Complainant states patient in video died due to hygiene issues.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X