Bachupally: రోడ్డుపై గుంత.. కింద పడిన చిన్నారి పై నుంచి వెళ్లిన బస్సు..
భారీ వర్షాలతో రోడ్లలన్నీ గుంతల మయంగా మారాయి. దీంతో రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ లోని బాచుపల్లిలో ఓ రోడ్డు గుంత చిన్నారిని బలి తీసుకుంది. తండ్రితో స్కూటీపై స్కూల్ వెళ్తున్న చిన్నారి రోడ్డు గుంత కారణంగా మృతి చెంది. గుంతలో స్కూటీ పడిపోవడంతో చిన్నారి స్కూటీ నుంచి జారీ రోడ్డుపై పడింది. అదే సమయంలో స్కూటీ వెనకాలే వస్తున్న ఓ స్కూల్ బస్ చిన్నారిపై నుంచి వెళ్లింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది.
చిన్నారి మృతి స్థానికంగా విషాదచాయలు నెలకొన్నాయి. బాచుపల్లికి చెందిన కిషోర్ కూతురు దీక్షిత స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్ లో రెండో తరగతి చదువుతోంది. బుధవారం ఉదయం కిషోర్ తన స్కూటీపై దీక్షితను పాఠశాలలో దింపడానికి వెళ్లాడు. వారు స్కూటీ ముందు వెళ్తోంది. వెనకాల ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్ వస్తుంది. వారి స్కూటీ రెడ్డి ల్యాబ్స్ వద్దకు రాగానే.. అక్కడ రోడ్డుపై ఉన్న గుంత కారణంగా స్కూటీ బోల్తా పడింది.

పట్టుతప్పిన దీక్షిత రోడ్డుపై పడిపోయింది. వెనకాలే వస్తున్న బస్ ఆమె నుంచి వెళ్లడంతో ఘటనాస్థిలిలోనే మృతి చెందింది. కళ్ల ముందే కుమార్తె చనిపోవడంతో కిషోర్ ఆహాకారాలు చేశాడు. విషయం తెలుసుకున్న తల్లి ఘటనా స్థిలికి చేరుకుని బోరున విలిపించారు. దీక్షిత దీక్షిత అంటూ రోదించిన తీరు స్థానికంగా ఉన్నవారిని కూడా కట్టతడి పెట్టించింది. ఈ ప్రమాదం కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. స్కూల్ బస్ డ్రైవర్ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
వర్షాలతో రోడ్లు గుంతల మయంగా మారాయిని స్థానికులు చెబుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి గుంతలను పూడ్చాలని కోరుతున్నారు. లేకుంటే ఇలాంటి ఘటనలు పునారవృతమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒక బాచుపల్లి ప్రాంతంలోనే కాదు.. సిటీలో చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న రోడ్ల మరమత్తులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications