Cable Bridge: కేబుల్ బ్రిడ్జి పై నుంచి చెరువులో దూకిన వ్యక్తి.. గాలిస్తున్న పోలీసులు..

హైదరాబాద్ మహానగరానికి సెంటర్ ఆఫ్ అట్రక్షన్ నిలుస్తున్న కేబుల్ బ్రిడ్జి ఆహ్లాదాన్ని అందించడమే కాదు విషాదానికి కూడా అడ్రస్ గా మారుతోంది. కేబుల్ బ్రిడ్జి నుంచి చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకోడం పెరిగిపోయింది. తాజాగా మరో వ్యక్తి కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి బ్రిడ్జిపై నుంచి దూకుతున్న సమయంలో కొంత మంది వాహనదారులు చూశారు. అతన్ని ఆపే ప్రయత్నం చేసే లోపే.. అతను చెరువులోకి దూకేశాడ.

వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థిలికి చేరుకున్న పోలీసులు చెరువులో దూకిన వ్యక్తి కోసం గత ఈతగాళ్లు, బోట్ల సాయంతో వెతుకుతున్నారు. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి ఎవరో అతని ఊచూకీ లభిస్తేనే తెలిసే అవకాశం ఉంది. అతను వ్యక్తిగత కారణాలతో సూసైడ్ కు పాల్పడ్డడా లేక మరేదైన కారణం ఉందో తెలియాల్సి ఉంది. కొన్ని రోజుల క్రితం ఓ మహిళ సైతం ఇలాగే బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. గతేడాది సెప్టెంబర్ ఓ మహిళ దుర్గం చెరువు దూకి ఆత్మహత్య చేసుకుంది.

Cable Bridge:

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ కు చెందిన స్వప్న దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యయత్నం చేసింది. అనారోగ్య సమస్యల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. కేబుల్‌ బ్రిడ్డి వద్ద స్వప్నకు సంబంధించిన హ్యాండ్‌ ఆధారంగా ఆమె ఆధారాలు పోలీసులు సేకరించారు.యువతి మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం, డిప్రెషన్ కు లోను కావడంతోనే సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు నిర్థారించారు. భర్తతో విడాకులు తీసుకొని 6 నెలలుగా దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.

Cable Bridge:
స్వప్న 2022 సెప్టెంబర్ 28 చెరువులోకి దూకగా.. ఆమె మృతదేహం ఆచూకీ సెప్టెంబర్ 30 తేదీన లభ్యమైంది.చెరువులో బురద ఎక్కువగా ఉండడంతో డెడ్ బాడీ వెతకడం కష్టంగా మారింది. తాజాగా ఆత్మహత్య చేసుకున్ వ్యక్తి మృతదేహం దొరకడం కష్టంగా మారింది. ట్యాంక్ బండ్ వద్ద లేక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లుగానే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద కూడా పోలీసులను కాపలా పెట్టాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+