Fire Accident: పరుపుల గోదాంలో భారీ అగ్నిప్రమాదం.. ఎక్కడంటే..!
హైదరాబాద్ ఏదో ఒక చోట అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కొద్ది రోజలు క్రితం హబ్సిగూడ చౌరస్తాలో బట్టల షోరూమ్ లో అగ్నిప్రమాదం జరిగింది. తాజాగా రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని మైలార్ దేవ్ పల్లిలోని టాటానగర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పరుపుల బెడ్ తయారుచేసే ఈ గోదాంలో ఆదివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు.
మొత్తం మూడు ఫైర్ ఇంజన్లతో మంటలు అదుపులోకి తెచ్చారు. ఫాహిం అనే వ్యక్తికి చెందిన పరుపుల గోదాంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంతో దాదాపు రూ.15 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు చెబుతున్నారు. బ్లాంకెట్ గోడౌన్‌లో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దాంతో లోపల ఉన్న దాదాపు 10 మంది కార్మికులు.. ఒక్కసారిగా బయటకు పరుగులు పెట్టారు. దాదాపు 1000 గజాల స్థలంలో ఈ గోడౌన్ ఉంది.

లోపల దట్టమైన పొగతోపాటూ.. మంటలు ఉన్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే చాలా వరకు ఫైర్ సెప్టీ జాగ్రత్తలు లేకుండానే షాపులు, ఆఫీస్ లు, పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications