హెచ్‌సీయూలో మరో విషాదం: హాస్టల్ గదిలోనే పీజీ విద్యార్థిని మౌనిక ఆత్మహత్య
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ పీజీ విద్యార్థిని ఆమె హాస్టల్ గదిలోనే ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతురాలు పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్(తారుపల్లి)కి చెందిన మౌనికగా గుర్తించారు. ఆమె ఎంటెక్‌లో నానో సైన్స్ చదువుతోంది.
ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, ఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తీవ్రమైన మానసిక ఒత్తిడితోనే మౌనిక ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు.

ఎంత చదివినా తన మనసుకు ఎక్కడం లేదని సూసైడ్‌లో మౌనిక పేర్కొన్నట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. గతంలోనూ హెచ్ సీయూలో పలువురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. కొన్ని ఘటనలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. స్పదంగా కూడా మారిన సంగతి తెలిసిందే.
రాఖీ కట్టించుకోలేదని చెల్లెలి ఆత్మహత్య
రాఖీ పండగ రోజున తనతో రాఖీ కట్టించుకోలేదని మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జహీరాబాద్ పట్టణంలోని మానిక్‌ప్రభు వీధికి చెందిన బొగ్గుల మమత(20) ఇద్దరు సోదరుల్లో పెద్దాయన పెళ్లి చేసుకుని వేరుగా ఉంటున్నాడు. ప్రస్తుతం ఇంట్లో అమ్మానాన్నలతోపాటు చిన్న అన్నయ్య రమేష్, మమత ఉంటున్నారు. ఆదివారం ఉదయం మమత చిన్న అన్నయ్య రమేష్‌కు రాఖీ కట్టేందుకు సిద్ధం కాగా, ఆయన నిరాకరించాడు. రాఖీ కట్టుకోవాలని పలుమార్లు మమత వేడుకుంది. అయినా అతడు పట్టించుకోకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. తల్లిదండ్రులు పనుల నిమిత్తం పొలానికి వెళ్లగా.. ఇంట్లో మమత ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గత పది రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయని.. ఈ క్రమంలోనే మమత, రమేష్ మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయని స్థానికులు తెలిపారు. మమత మృతితో ఆమె కుటుంబంతోపాటు స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అత్యాచారం కేసులు ఆరుగురికి జీవిత ఖైదు
రెండేళ్ల క్రితం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన అత్యాచారం కేసులో ఎల్బీనగర్ న్యాయస్థానం ఆరుగురికి జీవితఖైదు విధించింది. 2019 జనవరి 19న ఓ మహిళ కాలకృత్యాలు తీర్చుకోవడానికి హఫీజ్‌పేట రైల్వే స్టేషన్ సమీపంలోని పొదల్లోకి వెళ్లింది. కాగా, సమీపంలోనే మద్యం సేవిస్తున్న ఏడుగురు ఆ మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
Recommended Video
నిందితుల్లో ఒకరు మైనర్ కూడా ఉన్నాడు. ఎల్బీనగర్ కోర్టులో తగిన ఆధారాలు, సాక్ష్యాలు సమర్పించడంతో విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. నిందితులకు జీవితఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. బాలనేరస్తుడికి సంబంధించి కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది. కాగా, ఎల్బీనగర్ కోర్టు తీర్పుపై సైబరాబాద్ సీపీ సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తును పర్యవేక్షించిన డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీలు రవికుమార్, కృష్ణప్రసాద్‌లను సీపీ సజ్జనార్ అభినందించారు.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications