Viral Video: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదం.. వైరల్ అవుతోన్న వీడియో..
కొందరు రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు అత్యుత్సహంగా వ్యవహరిస్తారు. ముందు బండి దగ్గరి దాక వెళ్లి బ్రేక్ వేస్తుంటారు. గుద్దినంత పని చేస్తుంటారు. తాజాగా ఓ ఐటో డ్రైవర్ కూడా ఇలానే చేశాడు. ముందున్న వాహనం వద్దకు వచ్చి సడెన్ గా బ్రేక్ వేయడంతో పాటు ఆటోను సడన్ టర్న్ చేయడంతో ఆటో బోల్తా పడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హైదరాబాద్ లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి పై బీజీగా వాహనాలు వెళ్తోన్నాయి. ఇంతలో ఆటో వేగంగా వెళ్తోంది. ముందున్న వాహనాలను ఓవర్ టేక్ చేసుకుంటూ వెళ్తోంది. ముందు స్కూటీపై ఓ వ్యక్తి నిదానంగా వెళ్తోన్నాడు. వెనకాల వస్తున్న ఆటో వేగంగా వచ్చి స్కూటీని ఢీకొన్నంత పని చేసింది. స్కూటీ దగ్గరదాక వచ్చిన ఆటో డ్రైవర్ సడన్ ఆటోను తిప్పడంతో బోల్తా పడింది.

వెంటనే మిగతా వాహనాదారులు ఆటోను పైకి లేపారు. జూబ్లీహిల్స్ నుంచి ఐటీసీ కొహినూర్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు ఇద్దరు ప్రాయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ వేగంగా ఆటో నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.
హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం..!! pic.twitter.com/gJ7sNjxh0l
— oneindiatelugu (@oneindiatelugu) August 24, 2023
అటు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయలు అయ్యాయి. రెండు టిప్పర్లు పటాన్ చెరు వద్ద ఔటర్ రింగ్ రోడ్ పై నుంచి గచ్చిబౌలి వెళ్తోన్నాయి. ఓ టిప్పర్ కు సడన్ గా రిపేర్ రావడంతో రోడ్ పైనే ఆపివేశారు. టిప్పర్ కు రిపేర్ చేస్తున్న క్రమంలో ఓ కంటైనర్ వెనక నుంచి బలంగా ఢీకొట్టడంతో రిపేర్ చేస్తున్న ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications