వీడు భర్తేనా?: భార్య అశ్లీల వీడియోలు తీసి స్నేహితులకు, వారితో గడపాలంటూ ఒత్తిడి
హైదరాబాద్: ఇటీవల కాలంలో మూడు ముళ్ల బంధానికి విలువ లేకుండా చేస్తున్నారు కొందరు వివాహితులు. వివాహేతర బంధాలకు అవాటుపడి భాగస్వాముల ప్రాణాలు తీస్తున్నారు. మరోవైపు, అదనపు కట్నం కోసం వేధింపులకు పాల్పడి కట్టుకున్న భార్యల ప్రాణం తీస్తున్నారు మరికొందరు. తాజాగా, హైదరాబాద్ నగరంలోని శంషాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది.

స్నేహితుడితో ఏకాంతంగా గడపాలంటూ భార్యకు వేధింపులు
అదనపు కట్నం తీసుకురా? లేదంటే తన స్నేహితుడికి శారీరక సుఖాన్ని అందించు అంటూ ఓ దుర్మార్గుడు తన భార్యను వేధింపులకు గురిచేశాడు. విలాసాలకు అలవాటు పడి, ఏ పని లేకుండా తిరుగుతూ ఆమెను వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. అతని బాధలు భరించలేక చివరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.

భార్య అశ్లీల వీడియోలు తీసి స్నేహితులకు పంపాడు
జులాయిగా తిరుగుతున్న నిందితుడు.. తన ఖర్చులకు డబ్బులు లేకపోవడంతో భార్యను అదనపు కట్నం తేవాలని వేధింపులు గురిచేస్తున్నాడు. అంతేగాక, పడకగదిలో భార్య అశ్లీల దృశ్యాలను తన ఫోన్లో ఆమెకు తెలియకుండా రికార్డు చేసి వాటిని సోషల్ మీడియా ద్వారా తన స్నేహితుడికి పంపించాడు దుర్మార్గుడు.

భర్త వేధింపులు భరించలేక చివరకు..
విషయం తెలిసిన బాధితులు.. భర్తను నిలదీసింది. దీంతో అదనపు కట్నం తీసుకురా.. లేదంటే తన స్నేహిడితో ఏకాంతంగా గడుపు అంటూ ఆమెపై ఒత్తిడి చేశాడు భర్త. అతని వేధింపులు ఎక్కువ కావడంతో చివరకు శంషాబాద్ పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. ఆమె ఫిర్యాదుతో భర్త, అత్తమామలతోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

ఆ దుర్మార్గుడికే మద్దతు పలికిన అత్తామామ, కేసు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ కు చెందిన ఓ వ్యాపారి(35) 2016లో బాధితురాలు(27)ను వివాహం చేసుకున్నాడు. పెళ్లి సమయంలో రూ. 5 లక్షల నగదు, 9 తులాల బంగారు ఆభరణాలు, లక్షల విలువైన ఇతరత్రా ఇంటి సామాగ్రి తీసుకున్నాడు.
ఇప్పుడు అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా తన స్నేహితులతో గడపాలంటూ ఒత్తిడి చేశాడు. ఈ విషయం అత్తామామలకు చెబితే.. వారు కూడా బాధితురాలిపైనే మండిపడ్డారు. తమ కొడుకుకు మద్దతు పలుకుతూ అదనపు కట్నం తేవాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చారు. ఆమెపై దాడి కూడా చేశారు. ఈ క్రమంలోనే బాధితులు పోలీసులను ఆశ్రయించింది.












Click it and Unblock the Notifications