రాత్రి మహిళా కార్పొరేటర్‌కు ప్రజాప్రతినిధి ఫోన్, అసభ్య మాటలతో వేధింపులు
హైదరాబాద్: రాజకీయంగా ఎదిగి.. పలు హోదాల్లో పనిచేసిన అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి తన వక్రబుద్ధిని చాటుకున్నారు. పైకి మంచిగా నటిస్తూ.. వెనుక మాత్రం ఓ కీచకుడిగా వ్యవహరిస్తూ ఉండేవాడు. గతంలో ఎంతమంది మహిళలను వేధించాడో తెలియదు కానీ..తాజాగా ఓ మహిళా ప్రజాప్రతినిధిని కూడా విడిచిపెట్టలేదు. దీంతో ఆమె అతని కీచక బుద్ధిని బయటపెట్టింది. ఆ కీచకుడు మాట్లాడిన అసభ్య మాటలకు సంబంధించిన ఆడియో బయటపెట్టడంతో ఇప్పుడు అధికా పార్టీలోనే గాక, రాజకీయంగానూ కలకలం రేపుతోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కొద్దికాలంగా ఆ ప్రజాప్రతినిధి ఓ మహిళా కార్పొరేటర్‌తో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆమె భర్త కూడా రాజకీయాల్లో చురుగ్గానే ఉన్నారు. వ్యక్తిగత సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో చనువుగా ఉండేవాడు. అతడి బుద్ధి తెలియని ఆమె కూడా తన ఇబ్బందులను పంచుకునేది. దీన్ని అవకాశం చేసుకున్న సదరు ప్రజాప్రతినిధి తన వంకరబుద్ధిని బయటపెట్టాడు.

మూడు రోజుల క్రితం రాత్రివేళ ఆ మహిళా కార్పొరేటర్‌కు ఫోన్ చేసి వ్యక్తిగత విషయాలను ప్రస్తావించాడు. తిన్నావా.. లేదా? అంతరాత్రి వరకూ ఏమీ తినకపోతే ఆరోగ్యం ఏమవుతుందంటూ ఏదో జాగ్రత్త తీసుకుంటున్నట్లు కటింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత తన అసలు రూపం బయటపెట్టాడు. కొంతసేపటికే అసభ్యకరంగా మాట్లాడటంతో ఆమె ఆశ్చర్యానికి గురైంది.
వెంటనే తన ఫోన్లో ఆ సంభాషణలు రికార్డు చేసింది. అతని సంభాషణలను పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఓ మంత్రికి కూడా ఈ ఆడియోను పంపినట్లు తెలిసింది. అంతేగాక, ఆ కీచకుడి గురించి చెబుతూ ఆమె మంత్రి వద్ద కన్నీరుపెట్టుకున్నట్లు సమాచారం. విషయం బయటకు పొక్కనివ్వకుండా చూడాలని, తగిన చర్యలు తీసుకుంటామని అధినాయకత్వం ఆమెకు హామినిచ్చినట్లు సమాచారం. దీనిపై ఇంటెలీజెన్స్ వర్గాలు వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. కాగా, ఆ ప్రజాప్రతినిధి ఎవరంటూ ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.












Click it and Unblock the Notifications