హుస్సేన్ సాగర్‌లో తేలియాడిన మహిళ మృతదేహం
హైదరాబాద్: నగరంలోని హుస్సేన్ సాగర్‌లో ఓ మహిళ మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. పెట్రోలింగ్‌లో ఉన్న లేక్ పోలీసులకు హుస్సేన్ సాగర్‌లో మహిళ మృతదేహం తేలియాడుతున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో వారు వెంటనే డీఆర్ఎస్ బృందానికి సమాచారం అందించారు. ఈ క్రమంలో వారు వచ్చి మహిళ మృతదేహాన్ని బయటికి తీశారు.
ఆ మృతురాలి వయస్సు 25-30 ఏళ్లు ఉంటాయని పోలీసులు తెలిపారు. ఆమె ఒంటిపై క్రీం కలర్ టాప్, ఎరుపు రంగు ప్యాంట్ ధరించి ఉందని చెప్పారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే.. 040-27853595, 9948031574 నంబర్‌లను సంప్రదించి వివరాలు ఇవ్వాలని కోరారు.

నీటి గుంతలో పడి బాలుడు మృతి
ప్రమాదవశాత్తు నీటి గుంతలో బాలుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కాకినాడకు చెందిన భీమ్ శంకర్ తన భార్య పిల్లలతో కలిసి జూబ్లీహిల్స్‌లోని బైక్ షోరూం ప్రాంగణంలోని ఓ గదిలో ఉంటున్నాడు. అందులోనే భీమ్ శంకర్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. కాగా, అతడి కుమారుడు వివేకానంద(6) ఎప్పటిలాగే స్నేహితులతో పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకునేందుకు వెళ్లాడు.
అయితే, గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అక్కడి గుంతలో నీరు చేరింది. ఆ గుంతలో పడిన కర్రను తీసే క్రమంలో ప్రమాదవశాత్తు వివేకానంద అందులో పడిపోయాడు. వెంటనే స్నేహితులు ఈ విషయాన్ని బాలుడి తల్లిదండ్రులకు తెలియజేశారు. హుటాహుటిన వారు అక్కడికి చేరుకున్నారు. అయితే, అప్పటికే నీటిలో మునిగి వివేకానంద మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇది ఇలావుండగా, ఇటీవల భారీ వర్షాలతో మ్యాన్‌హోల్‌లో11 ఏళ్ల మౌనిక అనే బాలిక మృతి చెందింది.












Click it and Unblock the Notifications