మరో ఘోరం: స్కూటీపైకి దూసుకెళ్లిన టిప్పర్: తలపైనుంచి వెళ్లడంతో మహిళ మృతి

హైదరాబాద్: నగరంలో తరచుగా చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు నగరవాసిని భయాందోళనలకు గురిచేస్తున్నాయి. మంగళవారం బంజారాహిల్స్‌లో ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి స్కూటీని ఢీకొట్టడంతో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం పాలైన విషయం తెలిసిందే, తాజాగా కుషాయిగూడ పరిధిలోని రాధిక సిగ్నల్ వద్ద జరిగిన మరో ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.

దూసుకొచ్చిన టిప్పర్..

దూసుకొచ్చిన టిప్పర్..

ఈసీఐఎల్‌కు చెందిన కోలాటి సరిత స్కూటీపై ఇంటికి వెళుతోంది. రాధిక సిగ్నల్ సమీపంలోకి రాగానే వెనుక నుంచి వచ్చిన టిప్పర్ లారీ.. ఆమె స్కూటీని ఢీకొట్టింది. ఆ తర్వాత ఆమె తలపై నుంచి టిప్పర్ ముందుకు వెళ్లి ఆగింది. ఈ ప్రమాదంలో సరిత అక్కడికక్కడే మృతి చెందింది.

డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే..

డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే..

టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఘటనా స్థలంలో ఉన్నవారు చెప్పారు. టిప్పర్ డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
కాగా, సరిత ఓ ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు.

సీసీ కెమెరాల్లో దృశ్యాలు..

సీసీ కెమెరాల్లో దృశ్యాలు..

ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కాగా, మృతురాలి భర్త కోలాటి శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఇద్దరు మహిళలను ఢీకొట్టి పల్టీలు కొట్టిన కారు

ఇద్దరు మహిళలను ఢీకొట్టి పల్టీలు కొట్టిన కారు

ఇది ఇలావుంటే, ఎల్బీనగర్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. దిల్‌సుఖ్‌నగర్ నుంచి ఎల్బీనగర్ వైపు వెళ్తున్న కారు.. రోడ్డు దాటుతున్న ఇద్దరు మహిళలను ఢీకొట్టింది. ఆ తర్వాత డివైడర్‌ను ఢీకొట్టి పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదంలో గాయపడిన అక్కాచెల్లెళ్లను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, బంజారాహిల్స్‌లో మంగళవారం ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో సోహిని సక్సేనా అనే టీసీఎస్ ఉద్యోగిని ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+